ఏఐ జగత్తులో టాలెంట్ వార్!

Published on Fri, 08/14/2026 - 14:40

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్‌ బన్సల్‌ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్‌ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.

ఎవరీ త్రపిత్‌ బన్సల్?

త్రపిత్‌ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

తన పరిశోధనా కాలంలో ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్‌తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.

మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?

ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్‌కు ఉన్న మ్యాథమెటికల్‌ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.

యువతకు సందేశం

కోడింగ్ షార్ట్‌కట్‌లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్‌ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.

ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)