ఈ 3జీ కటింగ్‌తో.. ఒక్క మొక్క 3 రెట్లు దిగుబడి!

Published on Fri, 08/14/2026 - 09:28

మిద్దె తోటల్లో మొక్కలు గుబురుగా పెరిగి, ఎక్కువ దిగుబడి రావటానికి చేసే ఒక ముఖ్యమైన పద్ధతే 3జీ కటింగ్‌. ప్రధానంగా తీగ జాతి మొక్కలైన సొర, కాకర, దోస, బీర వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

1. మొక్క మొదటి తరాన్ని 1జీ అని, దాని నుంచి వచ్చే కొమ్మలను 2జీ అని, ఆ కొమ్మల నుంచి వచ్చే మరిన్ని కొమ్మలను 3జీ అని అంటారు. మొక్కకు కేవలం మగ పూలు కాకుండా, ఎక్కువ ఆడ పూలు (కాయలుగా మారేవి) రావటానికి ఈ పద్ధతిని వాడతారు.

2. మొదటి తరం (1G -1st Generation) : మొక్క పెరగడం ప్రారంభించినప్పుడు, ప్రధాన కాండం సుమారు 7–8 అడుగుల పొడవు పెరిగే వరకు ఉంచాలి. ఆ తర్వాత, ఆ ప్రధాన కాండం చివరను (కొనను) కత్తిరించాలి. దీన్నే 1జీ కటింగ్‌ అంటారు.

3. రెండో తరం (2G -2nd Generation) : ప్రధాన కాండం కత్తిరించిన తర్వాత ఆకు మూలల నుంచి కొత్తగా 2–3 కొమ్మలు వస్తాయి. వీటిని 2జీ కొమ్మలు అంటారు. ఈ 2జీ కొమ్మలు కూడా 2–3 అడుగులు పెరిగిన తర్వాత, వాటి చివరలను కూడా కత్తిరించాలి.

4. మూడో తరం(3G -3rd Generation) : ఇప్పుడు 2జీ కొమ్మల నుంచి మరిన్ని కొత్త కొమ్మలు (3జీ) వస్తాయి.ఈ 3జీ కొమ్మలపైనే అత్యధికంగా ఆడ పూలు వస్తాయి, ఫలితంగా కాయలు ఎక్కువగా కాస్తాయి.

5. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కనీసం 10–12 ఆకులు ఉన్నప్పుడే కటింగ్‌ ప్రారంభించాలి.

6. పొద జాతి మొక్కలకు (మిరప, టమోటా, మందార, మల్లె వంటివి) మనం చేసే కటింగ్‌ను సాధారణంగా ‘పించింగ్‌’ అని కూడా అంటారు. మొక్క 10–12 ఆకులతో ఒక అడుగు ఎత్తు పెరిగినప్పుడు, పై భాగంలోని లేత చిగురును తుంచేయాలి.

7. చిగురు తుంచిన చోట నుండి రెండు, మూడు కొత్త కొమ్మలు వస్తాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత వాటి చిగుర్లను కూడా తుంచితే, మొక్క మరింత గుబురుగా మారి ఎక్కువ పూలు, మొగ్గలు వస్తాయి.

8. గోరుచిక్కుడు మొక్కకు సాధారణంగా 3జీ కటింగ్‌ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది సహజంగానే కొమ్మలతో పెరుగుతుంది. అయితే మరీ పొడవుగా పెరుగుతుంటే పైభాగాన్ని తుంచవచ్చు.

9. టమాటాలో 3జీ కటింగ్‌ కంటే సక్కర్స్‌ తొలగించటం, ప్రూనింగ్‌ చేయటం దిగుబడి పెంచడానికి బాగా పనిచేస్తుంది.

10. టమాటాలో ΄ాకే రకాలు ఉంటాయి. ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటి చివరలను కట్‌ చేస్తే పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి, సాధారణంగా వీటి కాండం పక్కల నుండి వచ్చే అనవసరమైన చిన్న రెమ్మలను తీసేయాలి. 

11. పొద రకం టమాటా మొక్కలు  కొంత ఎత్తు పెరిగి ఆగిపోతాయి. వీటిని ఎక్కువగా కత్తిరించాల్సిన అవసరం లేదు, కేవలం కింద నేలకు తగిలే ఆకులను తీసేస్తే సరిపోతుంది.

12. టమాటా మొక్కలు లో అనవసరమైన కొమ్మలను లేదా చివరలను కత్తిరించడం వల్ల మొక్క తన శక్తిని పండ్లు పెద్దవిగా పెరగడానికి, త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంది. సీజన్‌ చివరలో మొక్క చివరలను కత్తిరించడం  వల్ల కొత్తగా పూలు పూయడం ఆగి, అప్పటికే ఉన్న కాయలు త్వరగా పండుతాయి.

13. కటింగ్‌ చేసిన వెంటనే మొక్కకు లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ 
(జీవామృతం లేదా బియ్యం కడిగిన నీళ్లు) లేదా వర్మీ కంపోస్ట్‌ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్త కొమ్మలు రావడానికి మొక్కకు శక్తి కావాలి. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారుచేసే జీవామృతం మొక్కకు అమృతంలా పనిచేస్తుంది. ఇది వారానికి ఒకసారి.  పోయవచ్చు.

14. గోళ్లతో తుంచడం కంటే పదునైన కత్తెర వాడటం మేలు. కత్తిరించిన భాగం వద్ద  కొంచెం పసుపు రాస్తే ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఉంటుంది. 

15. కటింగ్‌ తరువాత మొక్క పైన నీరు చల్లకుండా, మొదట్లో మాత్రమే పోయాలి. 

16. తీగ జాతి మొక్కలలో (సొర, బీర, కాకర వంటివి) పూత, పిందె దశలో ఉన్నప్పుడు 3జీ కటింగ్‌ చేయడం సరైన పద్ధతి కాదు. 3జీ కటింగ్‌ ప్రక్రియను మొక్క చిన్నగా ఉన్నప్పుడే (సుమారు 1 మీటర్‌ లేదా 6–8 ఆకులు ఉన్నప్పుడు) ప్రారంభించాలి. దీని ఉద్దేశ్యం కొత్త రెమ్మలను (2జీ, 3జీ కొమ్మలను) పుట్టించి, వాటిపై ఎక్కువ ఆడ పూలను వచ్చేలా చేయడం.

17. పూత, పిందె దశలో కొమ్మలను కత్తిరించడం వల్ల ఇప్పటికే ఉన్న పూలు, పిందెలు రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, మొక్క తన శక్తిని కొత్త కొమ్మల ఉత్పత్తికి మళ్లిస్తుంది, దీనివల్ల ఉన్న కాయలు సరిగ్గా పెరగవు. తగినంత ఎరువులు, నీరు అందిస్తే కాయలు నాణ్యంగా పెరుగుతాయి.

18. ఒకవేళ  మొక్క కేవలం మగ పూలనే పూస్తూ, అసలు పిందెలు పడకపోతే, అప్పుడు చివరి రెమ్మలను కొద్దిగా తుంచవచ్చు (పించింగ్‌).  కానీ పద్ధతి ప్రకారం చేసే 3జీ కటింగ్‌ మాత్రం పంట ప్రారంభ దశలోనే పూర్తి చేయాలి. 

19. 3ఎ కటింగ్‌ ద్వారా ఒకే మొక్క నుండి సాధారణం కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు.

20. మొక్కకు నత్రజని ఎక్కువగా అందడం వల్ల ఆకులు, మగ పూలు విపరీతంగా వస్తాయి. బూడిద లేదా అరటిపండు తొక్కల పొడి వంటివి వేయడం ద్వారా పొటాషియం, ఫాస్పరస్‌ అంది, ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. అరటిపండు తొక్కలను 2–3 రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పొటాషియం అందుతుంది.

21. ఇంట్లో వాడిన కోడిగుడ్డు పెంకులను పడేయకుండా, వాటిని పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి మొక్కలకు పోయటం ద్వారా  కాల్షియం అంది పిందెలు కుళ్ళిపోకుండా ఉంటాయి. పూత రాలకుండా బలంగా ఉంటుంది.

22. హ్యాండ్‌ ΄ాలినేషన్‌ చేయాలి. ఒకవేళ  తోటలో తేనెటీగలు లేకపోయినా లేదా ఆడ పూలు తక్కువగా ఉన్నా పిందెలు కాయలుగా మారవు. అప్పుడు మనమే స్వయంగా పరాగ సంపర్కం చేయవచ్చు. బాగా వికసించిన మగ పూవును కోసి, దాని రేకులను తీసివేసి ఆ మగ పూవు మధ్యలో ఉండే పరాగ రేణువులను ఆడ పూవు (పువ్వు కింద చిన్న పిందె ఉండేది) మధ్య భాగంలో మెల్లగా తాకించాలి.. ఈ పనిని ఉదయం 6 నుండి 9 గంటల లోపు చేస్తే ఫలితం బాగుంటుంది.

23. బాగా పులిసిన మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి  ఒక లీటరుకు 10 లీటర్ల నీరు కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయడం వల్ల పూత బాగా వస్తుంది.  ఇది ‘మిరకిల్‌ లిక్విడ్‌’ లాగా పనిచేస్తుంది. ఇంగువను పిచికారీ చేయటం వల్ల పూత రాలదు. మగ పూల కంటే ఆడ పూలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

24. మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మగ పూలు పెరిగే అవకాశం ఉంటుంది.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్‌: 94906 02366 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)