'వివాహం'పై కిరణ్‌ బేడీ షాకింగ్‌ వ్యాఖ్యలు..!

Published on Tue, 08/11/2026 - 17:34

మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ఐపీఎస్‌ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ ఏ విషయాన్ని అయినా చాలా ముక్కుసూటిగా నిష్కపటంగా చెబుతుంటారు. మహిళల సమస్యల విషయానికి వస్తే, ఆమె ఏమాత్రం భయపడకుండా, సాంప్రదాయాలను సవాలు చేసేలా..చాలా సూటిగా మాట్లాడతారు. నెల రోజుల క్రితం అభిషేక్ వ్యాస్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో, భారతీయ మహిళలకు వివాహం ఎలాంటిదో చాలా ఓపెన్‌గా చెప్పారు. ప్రతి ఆడపిల్ల ఆ విషయంలో ఎందుకు ఫెయిల్‌ అవుతుందో కూడా మాట్లాడారు. మరి అవేంటో చూద్దామా..!

పెళ్లి చాలా అందంగా ఉంటుంది, పెళ్లి ఊరేగింపు అట్టహాసంగా, వైభవంగా ఉంటుంది అంతే..అని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ మహిళకు చాలా సురక్షితమైన, ప్రేమగా, అండగా నిలిచే ఇంటిని వెళ్లిపోవాల్సి వస్తుంది కాబట్టి అది ఆమెకు 'మానసిక క్షోభే' అని నర్మగర్భంగా చెప్పారామె. అంతేగాదు ఒక  మహిళ తన పుట్టింటిని విడిచి వెళ్లడమే కాకుండా, తన అత్తమామలను కూడా సొంత తల్లిదండ్రుల్లా చూడాలని ఆశిస్తారని, ఇది చాలా  హాస్యాస్పదమైనదని అన్నారు. ఎందుకంటే అది ఆచరణ సాధ్యమైనది కాదని తేల్చి చెప్పారు. 

అసలు ఎవరైనా ఏదో ఒక మహిళను 'అమ్మా' అని పిలవగలరా? అది అసలు సాధ్యమేనా అని నిలదీశారు. వాస్తవం ఏంటంటే అసలు ఎవరూ అలా చేయలేరు, కానీ పెళ్లైన భారతీయ మహిళపై అలా చేయమని ఒత్తిడి చేస్తుంటారని అన్నారు. కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్త ఇంటి వాతావరణం ఎలా ఉన్నా సరే, దానికి అనుగుణంగా సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే పెళ్లి అన్న రెండు అక్షరాలతో ఆమె ఇంటికి 'యజమాని'గా మారుతుంది కాబట్టి అని అన్నారు. 

అయినా ఒక మహిళ గృహిణిగా ఉండాలనుకుంటుందా లేదా అనే విషయాన్ని కుటుంబాలు అసలు ఆలోచించవని అన్నారు. ఒకవేళ వివాహిత ఉద్యోగం చేస్తుంటే, ఇంటి పనుల కోసం సహాయకులను (domestic help) నియమించుకోవచ్చని ఆమె సూచించారు. వివాహానికి ముందే జంటలు ఈ విషయం గురించి ఎందుకు చర్చించరని డాక్టర్ బేడీ ప్రశ్నించారు. అలాగే పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగిస్తానని, ఇంటి పని కోసం సహాయకులను నియమించుకుంటానని, ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకుంటూ ఇంటిని నడుపుకోవచ్చని మహిళ స్పష్టంగా చెప్పాలని అన్నారు. తద్వారా ఆమెకు తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. 

నిజానికి పురుషులు తమ ఉద్యోగాలను వదలాల్సిన అవసరం ఉండదు కానీ మహిళలకే ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. చాలా సందర్భాల్లో మహిళలు వారి సొంత నిర్ణయంతోనే ఉద్యోగాలు వదిలేస్తుంటారని..ఇది ముమ్మాటికి వాళ్ల తప్పిదమేనని అన్నారు. ఎందుకంటే తాము కూడా సంపాదించి, తమ నిబంధనల ప్రకారం ఇంటిని నడపాలని వారు భావించరు. ఇద్దరూ ఆర్థికంగా సహకరించుకుంటూ మెరుగైన జీవితాన్ని గడపవచ్చని వాళ్లసలు ఆలోచించరు.

అలాగే ప్రపంచ బ్యాంక్ 2024 నివేదిక ప్రకారం, మహిళలు "వివాహపరమైన ప్రతికూలత"ను (marriage penalty) ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నాయి. భారతదేశంలో పిల్లలు లేకపోయినప్పటికీ, వివాహం తర్వాత మహిళల ఉపాధి రేటు 12% తగ్గుతుంది. అశోక యూనివర్సిటీ నివేదిక ప్రకారం, దాదాపు 73% మంది భారతీయ మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

అంటే ఇక్కడ పెళ్లయిన మహిళ త్వరలోనే ఇల్లు, కుటుంబం, భర్తను చూసుకునే వ్యక్తిగా మారిపోతుందని డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. ఇప్పుడు అదే మహిళ ఉద్యోగం కూడా చేస్తానంటే..ఆమెకు వివాహ జీవితం కష్టమైపోతుందని అన్నారు. ఇక్కడ ఆడపిల్లలు తెలుకోవాల్సింది ఏంటంటే..భర్త నుంచి తగిన మద్దతు లభించడం లేదని భావిస్తే, పెళ్లి తర్వాత కూడా తమ తల్లిదండ్రులతో కలిసి జీవించేంత ధైర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం మహిళలకు ఉండాలని ఆమె అన్నారు. పెళ్లి తర్వాత తల్లిదండ్రులను చూసుకోవడానికి వారితో కలిసి ఉండాలనుకునే మహిళను తక్కువగా చూడకూడదని, పైగా అటువంటి నిర్ణయాన్ని అభినందించాలని డాక్టర్ బేడీ పేర్కొన్నారు.

(చదవండి: మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా..)

 

 

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)