ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా..

Published on Tue, 08/11/2026 - 14:01

అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌కి గతేడాది మే నెలలో తీవ్రమైన ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆ కేనర్స్‌కు గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5)" ఉన్నట్లు వెల్లడిచారు అమెరికా వైద్యులు. అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ ప్రకారం..కేన్సర్‌ చాలా అసాధారణంగా కనిపిస్తే..గ్రేడ్‌ 5 కేటాయిస్తారు. ఇక్కడ గ్లీసన్‌ స్కోర్‌, గ్రేడ్‌ గ్రూప్‌ అనేవి కేన్సర్‌ ఎంత వేగంగా పెరుగుతుందో తెలియజేసే సంఖ్యలు. గ్లీసన్ స్కోర్ 8-10 ఉంటే..కేన్సర్‌ ప్రోస్టేట్‌ నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశాలు అధికం. 

ప్రస్తుతం జోబైడెన్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనకు కూడా కేన్సర్‌ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ స్వయంగా వెల్లడించారు. అది ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.

ప్రోస్టేట్‌కు ఆ స్వభావం ఉంది..
ఈ కేన్సర్‌ వెన్నుముక, కటి, తుంటి, పక్కటెముకలను ప్రభావితం చేస్తంఉది. దాదాపు అన్ని రకాల కేన్సర​్‌లు ఎముకలకు వ్యాపించగలవు. కానీ కొన్ని రకాల కేన్సరలు ఎముకలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో రొమ్ము కేన్సర్‌, ప్రోస్టేట్‌ కేన్సర్‌ ఉన్నాయి. ప్రోస్టేట్‌ కేన్సర్‌ కణాలు ‍ప్రాథమిక కణితి నుంచి విడిపోయి, రక్తప్రవాహం లేదా శోషరస వ్యవస్థ ద్వారా ప్రయాణించి..ఎముకల లోపల చేరి పెరుగుతాయి. 

ఫలితంగా కలిగే పరిణామాలు..
ఎముకలకు కేన్సర్‌ వ్యాప్తి చెందడంతో అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని..

1. తీవ్రమైన ఎముక నొప్పి
రాత్రిపూట లేదా కదలికల సమయంలో తీవ్రమయ్యే నిరంతర, మందమైన లేదా కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఎందుకంటే కేన్సర్ సాధారణ ఎముక నిర్మాణాన్ని దెబ్బతీసి, గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

2. ఎముకలు విరగడం
అత్యంత బలహీనమైన నిర్మాణం కారణంగా, చిన్నపాటి కదలికలు లేదా జస్ట్‌ కిందపడటంతోనే ఎముకలు విరిగిపోతాయి.

3. హైపర్‌కాల్షిమియా
ఎముకలకు కేన్సర్ వ్యాపించడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగి, వికారం, డీహైడ్రేషన్, గందరగోళం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

4. వెన్నుపాముపై ఒత్తిడి
వెన్నుపూసకు సమీపంలో మెటాస్టేసిస్ సంభవిస్తే, అవి వెన్నుపామును ఒత్తిడికి గురిచేసి, బలహీనత, స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా పక్షవాతానికి దారితీయవచ్చు.

5. కదలిక తగ్గడం
నొప్పి, ఎముకలు విరగడం వల్ల రోగి కదలడం పరిమితం కావచ్చు, ఇది వారి జీవన నాణ్యత, స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతుంది.

6. ఎముక మజ్జపై ప్రభావం
ఎముక మజ్జలో చేరిన కేన్సర్, శరీరం ఎర్ర, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, దీనివల్ల అలసట తోపాటు తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి.

చికిత్సా పద్ధతులు
సాధారణంగా ఎముకలకు వ్యాపించిన కేన్సర్‌ను నయం చేయలేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి, లక్షణాలను తగ్గించడానికి అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ, బిస్ఫాస్ఫోనేట్లు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీలు, శస్త్రచికిత్స వంటి ఉపశమన చికిత్సలు ఉన్నాయి.

ఎముకలకు వ్యాపించిన కేన్సర్ అనేది ముదిరిన దశకు ఒక సంకేతం. దీనిని అధికారికంగా స్టేజ్ IV ముదిరిన వ్యాధిగా వర్గీకరించారు. అంటే కేన్సర్ ఇకపై ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితం కాకుండా, శరీరమంతటా వ్యాపించి వ్యాధిగా మారిందని అన్నారు. దీనికి కేవలం ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే చికిత్స కాకుండా, పూర్తి శరీర చికిత్స  అవసరం అని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాకలు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: నో జిమ్‌, నో సప్లిమెంట్లు..! 75 ఏళ్ల వయసులోనూ ఆ అమ్మమ్మ..)

 

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)