ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్‌ అడ్వెంచర్‌!

Published on Mon, 08/10/2026 - 11:10

ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్‌ డూంగ్‌ కేవ్‌లోకి ఎంటర్‌ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్‌ నా కే బ్యాంగ్‌ నేషనల్‌ పార్క్‌లో సాన్‌ డూంగ్‌ కేవ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్‌ కేవ్‌గా ప్రసిద్ధి పొందింది.

ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్‌ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తాయి. నేచర్‌ తన కళతో క్రియేట్‌ చేసిన మాస్టర్‌ పీస్‌ అని చెప్పడం అతిశయం కాదు.

ఎందుకు స్పెషల్‌ ?
సాన్‌ డూంగ్‌ గుహను 1991లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్‌ అయ్యే వాతావరణం, అండర్‌గ్రౌండ్‌ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.

హైదరాబాద్‌ నుండి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్‌ లేదా హో చి మిన్‌ సిటీ కి కనెక్టింగ్‌ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్‌లో డాంగ్‌ హోయ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. డాంగ్‌ హోయ్‌ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్‌ నా విలేజ్‌కి ట్యాక్సీ లేదా షటిల్‌ బస్‌లో చేరుకోవచ్చు. సాన్‌ డూంగ్‌ కేవ్‌కి గవర్నమెంట్‌ అప్రూవ్డ్‌ గైడ్‌ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ తప్పనిసరి.

బడ్జెట్‌ ఎంత అవుతుంది? 
అఫిషియల్‌ సాన్‌ డూంగ్‌ ఎక్స్‌పిడిషన్‌ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్‌ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్‌ని సాన్‌ డూంగ్‌ ఎక్స్‌పిడిషన్‌ లేకుండా ఫోంగ్‌ నా రీజియన్‌  వరకు ప్లాన్‌ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్‌లో కంఫర్టబుల్‌గా పూర్తి చేయవచ్చు.

ఏం తినాలి?
వియత్నాం ఫుడ్‌ లవర్స్‌కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్‌ సూప్, బాన్‌ మీ శాండ్విచ్, ఫ్రెష్‌ స్ప్రింగ్‌ రోల్స్, కామ్‌ టామ్‌ చాలా ఫేమస్‌. శాఖాహారుల కోసం వెజ్‌ ఆప్షన్స్‌ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్‌ కాఫీని మాత్రం మిస్‌ అవ్వకండి.

దగ్గర్లో చూడాల్సినవి
సాన్‌ డూంగ్‌ కేవ్‌తో పాటు ఫోంగ్‌ నా కేవ్, ప్యారడైజ్‌ కేవ్, డార్క్‌ కేవ్, మూక్‌ స్ప్రింగ్‌ ఎకో ట్రెయిల్, బొటానిక్‌ గార్డెన్‌ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్‌ బ్యూటీ కనిపిస్తుంది.

సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్‌ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్‌ డూంగ్‌ కేవ్‌ని లైఫ్‌లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)