ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
Breaking News
కియా కార్లపై ఆగస్టు ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు
Published on Sat, 08/08/2026 - 11:09
కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కియా ఇండియా ఆగస్టు నెలలో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంపెనీ తన పలు మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, కార్పొరేట్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటి పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు అన్ని మోడళ్లు, వేరియంట్లకు ఒకేలా ఉండవు. డీలర్, నగరం, స్టాక్ లభ్యతను బట్టి కూడా మారే అవకాశం ఉంది.
కియా కార్నివాల్
ఆగస్టులో అత్యధిక ప్రయోజనం ఈ ప్రీమియం ఎంపీవీపై లభిస్తోంది. MY2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కలిపి గరిష్ఠంగా రూ.1.5 లక్ష నుంచి రూ.1.70 లక్ష వరకు ప్రయోజనం లభిస్తుందని వివిధ తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అన్ని ప్రయోజనాలు ప్రతి కొనుగోలుదారుడికి వర్తించవు.
కారెన్స్ క్లావిస్
MY2026 పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.95,000 వరకు లభించవచ్చు. పాత MY2025 టర్బో-పెట్రోల్ స్టాక్‌పై ప్రయోజనం మరింత ఎక్కువగా ఉండొచ్చు.
కారెన్స్ క్లావిస్ ఈవీ
MY2026 ఎలక్ట్రిక్ MPVపై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.75,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.
కియా సైరోస్
MY2026 టర్బో-పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. అంటే గరిష్ఠంగా రూ.65,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. డీజిల్ వెర్షన్‌పై ప్రయోజనం రూ.55,000 వరకు ఉంటుంది.
కియా సోనెట్
MY2026 సోనెట్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనం ఉంది. ముఖ్యంగా 1.2 HTK(O) వేరియంట్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.15,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తాయి.
కియా సెల్టోస్
కొత్త తరం సెల్టోస్‌పై గరిష్ఠంగా రూ.40,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. పాత MY2025 స్టాక్‌పై మాత్రం ప్రధానంగా స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే లభిస్తోంది.
కియా కారెన్స్
MY2026 కారెన్స్‌పై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, కార్పొరేట్ బెనిఫిట్‌గా రూ.15,000 వరకు కలిపి రూ.35,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.
పాత స్టాక్‌పై భారీ ప్రయోజనాలు
ఆగస్టు ఆఫర్లలో MY2025 స్టాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తోంది. ముఖ్యంగా కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ MY2025 మోడళ్లపై రూ.1.40 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుండగా, ఇందులో భారీ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. సైరోస్ MY2025 స్టాక్‌పై రూ.70,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. అందువల్ల పాత స్టాక్ కొనుగోలు చేసే వారు తయారీ నెల, మోడల్ ఇయర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయడం మంచిది.
ఇదీ చదవండి: 165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
Tags : 1