Breaking News

ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ

Published on Wed, 08/05/2026 - 12:38

ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొత్తవి రావడం లేటు చూసేస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగుల రూపంలో ప్రతివారం వస్తూనే ఉంటాయి. అలా ఈ మంగళవారం(ఆగస్టు 04) 'ఉయిర్' అనే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
అజీబ్ (రోషన్ మాథ్యూ) ప్రొబేషనరీ ఎస్సైగా ఓ పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. కొన్నిరోజుల తర్వాత ఊరి చివరన ఉండే పాడుబడ్డ బావిలో ఓ మహిళ శవం బయటపడుతుంది. దర్యాప్తు చేయగా ఆమె పేరు శోభ అని, రోజు కూలీ అని తెలుస్తుంది. తొలుత ఈమెది ఆత్మహత్య అనుకుంటారు. మరోచోట ఉన్న భర్తని పిలిపించి శోభ కాదా అని ధ్రువీకరించుకున్న తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తిచేస్తారు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌కి వచ్చిన శోభ బంధువులు షాకింగ్ విషయాలు చెబుతారు. దీంతో కేసు మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఇది ఆత్మహత్య లేదా హత్య? అసలు ఈమె భర్త, పిల్లలు ఏమయ్యారు? చివరకు అజీబ్ ఈ కేసుని పరిష్కరించాడా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
మలయాళంలో పోలీస్ నేపథ్యంతో ఎన్ని సినిమాలు తీస్తారో ఏమో గానీ ప్రతి నెల ఒకటి రెండు చొప్పున వస్తున్నట్లే ఉంటాయి. అలా రీసెంట్‌గా రిలీజైన మూవీ 'ఉయిర్'. ఈ పదానికి తెలుగులో 'ప్రాణం' అని అర్థం. సినిమా విషయానికొస్తే చాలా సహజంగా ఉంది. అదే టైంలో థ్రిల్ కూడా పర్లేదు. ఇక్కడ పర్లేదు అని ఎందుకున్నానంటే కథ పరంగా మంచి లైన్. కాకపోతే ట్విస్టులు, హై మూమెంట్స్ వచ్చినా మనం ఫీల్ కాలేకపోతాం. ఫ్లాట్‌గా అనిపిస్తుంది. 

ఓ మహిళ శవం దొరికిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందనుకుని అంత్యక్రియలు చేసేస్తే తర్వాత అది హత్య అని తేలితే.. కొత్తగా పోలీస్ అయి, ఈ కేసుని విచారించిన అధికారి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు? దీనిని ఎలా పరిష్కరిస్తాడు? అనే విషయాలే ఈ సినిమా స్టోరీ. హీరో చిన్నప్పుడు ట్రైన్‌లో తన కుటుంబంతో కలిసి ప్రయాణించే సీన్‌తో మూవీ మొదలవుతుంది. అప్పుడు తన సోదరి తప్పిపోతుంది. కట్ చేస్తే ప్రస్తుతానికి స్టోరీ వచ్చేస్తుంది.

అజీబ్.. ప్రొబెషనరీ ఎస్సైగా విధుల్లో చేరడం, ఓ శవం దొరకడం, పై అధికారులు ఈ కేసుని ఇతడికి అప్పగించడం.. ఇలా ఏదో జరగబోతుందనే ఆసక్తితో స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఏంటి ఇంత సింపుల్‌గా వెళ్తుందా అని అనుకుంటాం. ఇంటర్వెల్ టైంకి కేసు పరిష్కారం కూడా అయిపోతుంది. అదేంటి ఇంతేనా అనుకునే టైంకి ట్విస్ట్. ఆమె వ్యక్తిగత జీవితం తెరపైకి వస్తుంది. దాన్ని చూపించిన విధానం పర్లేదనిపించేలా  ఉంది.

సినిమా ఓవరాల్‌గా బాగుంది కానీ ఫస్టాప్‌లో పాత్రల మార్పుతో వచ్చే సీన్లు ఉంటాయి. మొదటిది చూపించిన తర్వాత మళ్లీ పాత్రలని మార్చి రిపీట్ చేస్తారు. దానిని మాంటేజ్ రూపంలో సింపుల్‌గా తేల్చేస్తే సరిపోతుంది. కానీ మళ్లీ చూపించేసరికి సాగదీసినట్లు అనిపిస్తుంది. కథలో భాగంగానే వచ్చే ఐటమ్ సాంగ్ కూడా స్టోరీకి అవసరం లేదు. ఇక ప్రీ క్లైమాక్స్ వరకు పెద్దగా హడావుడి లేకుండానే వెళ్లిన స్టోరీ.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. గుండె బరువెక్కిస్తుంది.

‍క్లైమాక్స్‌లో ముంబై నేపథ్యంగా సాగే పిల్లల సీన్స్ అయితే చిన్నపాటి భయాన్ని కలిగిస్తాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలని ఆయా సన్నివేశాల్లో చూపించిన విధానం, ఎంత పెద్ద పోలీసులైనా సరే నిస్సహయులుగా ఎలా ఉండాల్సి వస్తుందో చూపించారు. ఈ సినిమాలో పోలీస్ పాత్రలు తెలుగులోనే మాట్లాడుతుంటాయి. చనిపోయిన మహిళ, ఆమె భర్త, మిగతా కొన్ని పాత్రధారుల నేపథ్యం తమిళనాడు, కర్ణాటక అన్నట్లు చూపించిన కారణంగా డబ్బింగ్ సినిమా అయిప్పటికీ కన్నడ, తమిళ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. మూవీ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా నిజంగానే జరిగిందనే సంగతి బయటపెడతారు.

యాక్టింగ్ వియానికొస్తే అజీబ్ అనే పోలీస్‌గా చేసిన రోషన్ మాథ్యూ ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు కూడా కథకు తగ్గట్లు నటించారు. ఎవరూ కూడా యాక్టర్స్ అనే ఫీలింగ్ రాదు. అంతలా జీవించేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాతదిలా అనిపిస్తుంది గానీ పర్లేదు బాగానే ఉంది. ఓ పావు గంట నిడివి కట్ చేసినా పర్లేదనిపించింది. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. ఓవరాల్‌గా ఇదో పర్లేదనిపించే థ్రిల్లర్.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చేసిన ‍తెలుగు సినిమాలు)

Videos

NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు

తమాషాలు చేస్తున్నారా? పోలీసులపై అమర్నాథ్ ఫైర్!

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం

భారత్‌పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg

హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ 8 కాలేజీలు క్లోజ్

జగన్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు

దుబాయ్ గుండెలపై మిస్సైళ్ళ వరం

క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?

రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్

Photos

+5

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్..(ఫొటోలు)

+5

బ్లూ శారీలో టాలీవుడ్ నటి అనసూయ అందాలు (ఫొటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ దేవరపల్లి పర్యటన.. ప్రజలు బ్రహ్మరథం (ఫొటోలు)

+5

అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)

+5

బన్నీ 'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)

+5

హ హ హాసిని బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టిన తెలుగుగమ్మాయి.. ఈషా రెబ్బా (ఫొటోలు)