Breaking News

చిరంజీవి, నాగార్జునతో మల్టీస్టారర్‌.. అనిల్‌ ప్లాన్‌ అదుర్స్‌

Published on Sun, 08/02/2026 - 14:06

మల్టీ స్టారర్‌ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి నటిస్తే.. యావరేజ్‌ ఉన్నా సరే.. సినిమాను సూపర్‌ హిట్‌ చేస్తారు. అందుకే గతంలో ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చేవి. ఈ మధ్య తెలుగు హీరోలంతా పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్‌ పెట్టడం.. సోలోగా రాణించాలనే తపనతో మల్టీస్టారర్‌పై ఆసక్తి చూపించడం లేదు. అయితే స్టార్స్‌ కలిసి చేస్తే మాత్రం ఆ సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఇప్పుడు అదే చేయబోతున్నాడు. టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునలతో క్రేజీ సినిమా తెరకెక్కించబోతున్నాడట.

అనిల్‌ రావిపూడి సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. స్టార్స్‌తో కూడా కామెడీ చేయించి హిట్‌ కొడతాడు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తీశాడు. ఇప్పుడు ఆయన ఫోకస్‌ నాగార్జునపై పడింది. నాగార్జునతో సినిమా చేస్తానని అనిల్‌ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. త్వరతోనే ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలపైకి ఎక్కించబోతున్నాడు. ప్రస్తుతం నాగార్జున తన 10వ సినిమాలో బిజీగా ఉన్నాడు. 

ఇది పూర్తయిన తర్వాత అనిల్‌తో సినిమా చేస్తాడని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. నాగార్జునతో సోలో సినిమా కాకుండా చిరంజీవిని కూడా కలిపి మల్టీస్టారర్ రూపొందించాలని అనిల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఇలా ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానులకు అది నిజంగా పండగ అనే చెప్పొచ్చు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)