Breaking News

‘ఈ20 పెట్రోల్‌’ విధానంతో లాభమే..

Published on Sun, 08/02/2026 - 08:32

న్యూఢిల్లీ:  ఈ20 పెట్రోల్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. అమెరికా–ఇరాన్‌ యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు భారతీయ వినియోగదారులను ధరల భారం నుంచి రక్షించడంలో ఈ20 పెట్రోల్‌ విధానం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమాసియాలో సంక్షోభం త్రీవస్థాయిలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు(సుమారు రూ.13,000) పెరిగాయని గుర్తుచేసింది. ఆ సమయంలో భారత్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.125కు చేరి ఉండేదని వెల్లడించింది. కానీ, మన ప్రభుత్వం భారీగా ధర పెంచలేదని తెలియజేసింది. సంక్షోభ సమయంలో వినియోగదారులకు లీటర్‌కు రూ.30 వరకు ఆదా ఆయినట్లు పేర్కొంది. 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఢిల్లీలోని వినియోగదారులు లీటర్‌కు రూ.94.77 చొప్పున చెల్లిస్తున్నారని వివరించింది. దీనివల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం మన వినియోగదారులపై పడడం లేదని తేల్చిచెప్పింది.

80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించడమే ఈ20 విధానం. దీన్ని ప్రతిపక్షాలు, వినియోగదారుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ20 పెట్రోల్‌ వాడకం వల్ల వాహనాల మైలేజీ తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని కొందరు వాహనాల యజమానులు చెబుతున్నారు. అయితే, అందులో నిజం లేదని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఈ20 వల్ల మైలేజీ కొంత తగ్గినప్పటికీ, దానివల్ల కలిగే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని వాదిస్తోంది.

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)