BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
Breaking News
సొంత మేనమామే బలవంతం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
Published on Wed, 07/29/2026 - 15:23
బుల్లితెర నటి, ‘బాలికా వధు 2’ సీరియల్ ఫేం శివాంగి జోషి చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ ఎమోషనల్ అయింది. తాజాగా ‘లాకప్ 2’ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె.. చిన్నప్పుడు సొంత మేనమామనే తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు.
‘మా అమ్మకు సోదరుడైన ఓ వ్యక్తిని నేను చాలా నమ్మేదాన్ని. ముద్దుగా మామాజీ అని పిలిచేదాన్ని. నన్ను రోజు స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడు. మా అమ్మ అతన్ని ఎంతగానో నమ్మేది. అదే ఆసరాగా చేసుకొని నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను సినిమాల్లోకి వెళ్లాలంటే ముందుగా డ్రైవింగ్ నేర్చుకోవాలని చెబుతూ..ఒల్లో కూర్చోబెట్టుకొని ఏదోదో చెప్పేవాడు. ఆయన ఏం చెబుతున్నాడో.. ఆయన ఉద్దేశాలు ఏంటో అర్థం కాలేదు. కానీ నాకు నచ్చలేదు. నేను డ్రైవింగ్ నేర్చుకోనని చెప్పి.. పక్కకు వచ్చేశా.
ఓ రోజు మా అమ్మనాన్నలు బయటకు వెళ్లారని తెలుసుకొని.. ఇంట్లోకి వచ్చాడు. హీరోయిన్‌వి కావాలంటే రకరకాల సీన్లలో నటించాలంటూ.. నా నుదుటిపై, చెంపలపై ముద్దు పెట్టాడు. నా పెదాలపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా..తోసేశాను. దీంతో అతనికి కోపం వచ్చి నన్ను కింద పడేశాడు. అదృష్టంకొద్ది అప్పుడే అమ్మనాన్నలు ఇంట్లోకి వచ్చారు. నా అరుపులు విని గదిలోకి వచ్చి చూశారు. ఏం జరిగిందో తెలుసకొని..అతన్ని కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు’ అని చెబుతూ శివాంగీ ఎమోషనల్ అయింది.
Tags : 1