Breaking News

ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు

Published on Mon, 07/27/2026 - 23:45

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారీ అంచనాలతో విడుదలైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో  హిట్‌ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆయన కమ్‌బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లో.. అప్పట్లో 'పూరి' ఒక వ్యక్తిని బాగా నమ్మాడు. కానీ ఆ వ్యక్తి చేసిన మోసం వల్ల ఆయనకు భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఆ అప్పులు తీర్చేందుకు ప్రతి నెలా రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. దాంతో చివరికి పూరి ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఆఫీస్‌ను కూడా అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత అద్దె ఆఫీస్‌లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘు కుంచె తెలిపారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం ఆయన వెల్లడించలేదు. అప్పట్లో ఓ ఇంటర్వూలో పూరి కూడా ఈ విషయంపై స్పంధించారు. అప్పుడు నేను ప్రభాస్‌, గోపీచంద్‌, అమితాబ్‌ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను. కానీ వచ్చే డబ్బు మాత్రం అప్పులకు వడ్డీలు చెల్లించేవాడిని. ఆ సమయంలో పెంపుడు జంతువులను కూడా ఫీడ్‌ చేయలేక ఇతరులకు ఇచ్చేశాను. ఆ సమయంలో మొదటిసారి ఏడ్చాను. నా డబ్బు పోయినదానికంటే ఆ విషయంలో నేను ఎక్కువ బాధపడ్డానని పూరి చెప్పారు.


ఇక పూరి జగన్నాధ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఈ సినిమా కీలక మలుపు అవుతుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.

Videos

ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎందుకు అంత ద్వేషం..!

మీకు ఆ దమ్ముందా..? చంద్రబాబుకు బోండా ఉమా కౌంటర్

ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు..! హైదరాబాద్ లో కొత్త AI కెమెరాలు

విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం

హైడ్రా ముసుగులో రియల్ ఎస్టేట్ దందా..

High Court: సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ

16 డిమాండ్లతో కార్మికుల పోరు! ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటమే..!

తిరుపతిలో జనసేన నాయకుడు ఆత్మహత్య

అస్మిత్ రెడ్డిపై షాకింగ్ ఆరోపణలు.. ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

Photos

+5

ISSF World Cup: అదరగొట్టిన భారత షూటర్లు.. సింగ్‌కు స్వర్ణం, మనుకు కాంస్యం (ఫొటోలు)

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)