డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు
Published on Mon, 07/27/2026 - 15:50
బాలీవుడ్ తొలితరం సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా.. 2012లో చనిపోయారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం రాజేశ్ మాజీ భాగస్వామి అనితా అద్వానీ. కొన్నాళ్ల క్రితం తమ సహజీవనానికి చట్టబద్ధ గుర్తింపు కోరుతూ బాంబే హైకోర్టులో ఈమె పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిత.. రాజేశ్ ఖన్నా, ఆయన భార్య డింపుల్ కపాడియా గురించి సంచలన కామెంట్స్ చేసింది.
(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)
1973లో తనకంటే చాలా చిన్న వయసున్న డింపుల్ కపాడియాని రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నారు. వీరికి ట్వింకిల్ ఖన్నా(హీరో అక్షయ్ కుమార్ భార్య), రింకీ ఖన్నా అనే కూతుళ్లు ఉన్నారు. 1982లో డింపుల్, రాజేష్ ఖన్నా ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా బతికారు గానీ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అయితే డింపుల్ దూరమైన తర్వాత రాజేశ్ ఖన్నా.. 2012లో మరణించే వరకు అనితా అద్వానీ అనే మహిళతో కలిసున్నారు. ఈ క్రమంలోనే తమ బంధానికి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని అనిత.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1న ఈమె అప్పీల్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఇది లివ్-ఇన్ రిలేషన్‌షిప్ మాత్రమేనని, హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పెళ్లిగా పరిగణించలేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనితా అద్వానీ.. నా కేసుని హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద విచారించడం సరైనది కాదు. నన్ను భార్యగా గుర్తించలేమని కోర్టు పేర్కొంది. చెప్పాలంటే రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాని ఎన్నోసార్లు విడాకులు అడిగారు. కానీ ఆమె అంగీకరించలేదు. విడాకులు ఇవ్వాలంటే ఆస్తులన్నీ తమ పేరు మీద బదిలీ చేయాలని షరతు విధించింది. రాజేష్ ఖన్నా, డింపుల్ చాలా ఏళ్లుగా కలిసి జీవించలేదు. అయితే వాళ్లు విడాకులు కూడా తీసుకోకపోవడం వల్ల నాలాంటి వ్యక్తికి ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకుండా పోయాయి. ఒక వ్యక్తి జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ లభించకపోవడం బాధాకరం అని అనితా అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె చేసిన వ్యాఖ్యలపై డింపుల్ కపాడియా లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
(ఇదీ చదవండి: 'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?)
Tags : 1