Breaking News

మహిళలకు స్వర్గధామం ఈ దేశాలు..

Published on Mon, 07/27/2026 - 11:30

ప్రపంచవ్యాప్తంగా మహిళల పురోగతి, న్యాయం, భద్రత ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ నివేదిక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అమెరికాలోని ‘జార్జ్‌టౌన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ’ విడుదల చేసిన వుమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్(2025-26) ప్రకారం.. మహిళలు స్వతంత్రంగా, సురక్షితంగా, సాధికారతతో జీవించడానికి ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ (0.939 స్కోరు) అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 181 దేశాల్లో మహిళల భాగస్వామ్యం, చట్టపరమైన రక్షణ, భద్రతలకు సంబంధించిన 13 కీలక సూచికలను ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను ఖరారు చేశారు.

టాప్-5లో నార్డిక్ దేశాలు

1. డెన్మార్క్ (0.939)

2. ఐస్‌లాండ్ (0.932)

3. నార్వే (0.924), స్వీడన్ (0.924)

4. ఫిన్‌లాండ్ (0.921)

లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ తదితర దేశాలు టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా (11), కోస్టారికా, ఉరుగ్వే వంటి లాటిన్ అమెరికా దేశాలు సైతం గణనీయమైన ప్రగతితో ఉత్తమ శ్రేణిలో నిలిచాయి.

నార్డిక్ మోడల్ ప్రత్యేకత ఏమిటి?

ఉచిత విద్య, ఉద్యోగాల్లో అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యం, బలమైన ఆర్థిక పురోగతి, రాజకీయ ప్రాతినిధ్యం, సమర్థవంతమైన చట్టపరమైన రక్షణలు నార్డిక్‌ దేశాల విజయ రహస్యం. బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉన్న చోట మహిళలపై హింసాత్మక సంఘటనలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

యుద్ద భయాలు.. దయనీయ స్థితిలో చివరి స్థానాలు

మరోవైపు అంతర్యుద్ధాలు, నిరంకుశ పాలన, రాజకీయ అస్థిరత ఎదుర్కొంటున్న దేశాల్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అఫ్గానిస్థాన్ (181వ ర్యాంకు) ఆఖరి స్థానంలో నిలిచింది. యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సుడాన్, హైతీ, కాంగో, మయన్మార్‌ దేశాలు అడుగున మిగిలాయి. ఈ ర్యాంకులో దిగువన ఉన్న 12 దేశాల్లో నివసిస్తున్న 70 శాతానికి పైగా మహిళలు భీకర సాయుధ పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలకు కేవలం 50 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. ఇది వారి ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ సూచీలో భారతదేశం 131వ ర్యాంకుతో 0.607 స్కోరు, పాకిస్థాన్ 169వ ర్యాంకుతో 0.462 స్కోరుతో నిలిచాయి.

ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?

#

Tags : 1

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)