Breaking News

టీసీఎస్‌ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్‌ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..

Published on Sun, 07/26/2026 - 11:58

కొన్ని సమయాల్లో కంఫర్ట్‌ జోన్‌ కంటే రిస్క్‌ తీసుకుంటేనే గొప్ప విజయాలను సొంత చేసుకోగలం. అలా చేసి ఎందరో విజేతలుగా నిలిచిన ఘటనలు చూశాం. అంత ముక్తకంఠంలో మహారిస్క్‌ అ‍న్నా..తగ్గేదేలే అంటూ ముందుకు సాగి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కోవకు చెందని వాడే ఈ వ్యక్తి. చాలామంది కోరుకునే డ్రీమ్‌ జాబ్‌ని కాదనుకుని ఎలాంటి వ్యాపారం రంగంలోకి దిగాడో వింటే నోటమాటరాదు.

అందుకు సంబంధించిన విషయాన్ని అంకిత్‌ పాండ్‌ సోషల్‌మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఎక్స్‌పోస్ట్‌లో అంకిత్‌ పాండే ఇలా రాసుకొచ్చారు. తన స్నేహితుడు టీసీఎస్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ని వద్దనుకుని మరి వ్యాపారం చేయాలి నిర్ణయించుకున్నాడు. మొదట అదడి నిర్ణయం విని స్నేహితులంతా తప్పు చేస్తున్నావంటూ విమర్శించారని చెప్పాడు. కానీ అతడు గ్రామాలు, రాష్ట్రాలలోని రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని సేకరించి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం ఆ వ్యాపారవేత్త రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేసి, దాన్ని శుభ్రపరిచి, దానికి తన సొంత బ్రాండ్‌ప్యాకేజీ చేయించాడు. వాటిని సుమారు 200 రిటైల్‌ దుకాణాలకు సరఫరా చేశారు. మధ్యవర్తులను తొలగించి, ఒక స్థిరమైన రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా, ఆయన లాభదాయకమైన, నిలకడైనా వ్యాపారాన్ని సృష్టించారని సమాచారం.

వ్యాపారం ట్రిక్‌ ఏంటంటే..
రైతుల నుంచి కిలో బియ్యాన్ని రూ. 35ల చొప్పున కొనుగోలు చేస్తారు. ప్యాకేజింగ్‌కు, కిలోకు రూ. 3లు, రవాణా ఖర్చుకు మరో రూ. 2 అదనం. దీంతో మొత్తం ఖర్చు కిలోకు రూ. 40 అవుతుంది. అంటే ప్యాకేజీ చేసిన బియ్యాన్ని రిటైలర్లకు కిలోకు రూ. 50 చొప్పున అమ్ముతారు. రిటైలర్లు దానిని వినియోగదారులకు కిలోకు సుమారు రూ. 55–57 చొప్పున అమ్ముతారు. దీంతో అమ్మిన ప్రతి కిలోపై వారికి రూ. 10 లాభం వస్తుందని వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. 

ప్రస్తుతం ఈ వ్యాపారం ప్రతి నెలా తమ రిటైల్ భాగస్వాములకు సుమారు 200 క్వింటాళ్లు, అంటే 20 వేల కిలోగ్రాముల బియ్యాన్ని సరఫరా చేస్తోందని పాండే అన​ఆనరు. ఈ గణాంకాల ఆధారంగా తన స్నేహితుడు సుమారు రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడని అంచనా వేశారు. అయితే నెటిజన్లు తీసుకునే రిస్క్‌ని బట్టి ఫలితం కూడా ఆస్థాయిలో ఉంటుందని సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరు పైకి చూడటానికి సునాయాసంగా కనిపిస్తున్నా..టీసీఎస్‌ ఉద్యోగంతో పోలిస్తే..వ్యాపారం నుంచి లాభం పొందడం అనేది కొంచెం కష్టమే అంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..)

 

#

Tags : 1

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)