Breaking News

సరికొత్త బ్రెజ్జా లాంచ్: రూ.7.40 లక్షలు!

Published on Fri, 07/24/2026 - 21:21

మారుతి సుజుకి తన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ కొత్త ఇంజన్ ఆప్షన్‌తో పాటు చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది.

2026 ఎడిషన్ బ్రెజ్జాలో అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ పాడ్‌లతో కూడిన కొత్త బంపర్లు, కొత్త 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌లైట్‌లను యథాతథంగా కొనసాగించారు.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త బ్రెజ్జా బ్లాక్ అండ్ బేజ్ రంగుల కలయికతో పాటు గ్లాస్ బ్లాక్ ట్రిమ్‌ను పొందుతుంది. మధ్యలో పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని కింద విక్టోరిస్ నుంచి తీసుకున్న ఎయిర్ కండిషనింగ్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ SUVలో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భద్రతా ఫీచర్లలో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి. ఇది స్ప్లెండిడ్ సిల్వర్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, బ్లూయిష్ బ్లాక్ రంగులతో పాటు, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బీజ్ అనే రెండు కొత్త రంగులలో కూడా లభిస్తుంది.

ఇదీ చదవండి: ఒక కారు.. 15 లక్షల సేల్స్!

2026 బ్రెజ్జా కొత్త 1.0-లీటర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 108 Bhp పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఇది 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG వెర్షన్ కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తుంది.

Videos

LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్

రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?

వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL

SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్

అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!

మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్

గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు

ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది

అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు

పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)