LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్
Breaking News
ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు
Published on Fri, 07/24/2026 - 11:49
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఏడాది పాటు పనిచేశానని, కానీ తన సీన్ కట్ చేసి పడేశారని ఓ తమిళ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధని బయటపెట్టింది.
(ఇదీ చదవండి: 'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)
'ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు పనిచేశాను. విజయ్ సర్‌తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. 'జన నాయగన్' విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది' అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆనంది.. స్వతహాగా సీరియల్ నటి. తమిళంలో 'కార్తిగై పెంగళ్', 'యమునా', 'కనా కానుం కాలంగళ్', 'కల్లికట్టు పళ్లికూడం' తదితర సీరియల్స్‌లో నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. 'డాన్స్ జోడీ డాన్స్ 3.0', 'జోడి నెం.1' సీజన్ 6, 7, 'మానాడా మయిలాడా' సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో అయితే సూర్య 'కరుప్పు', గట్టకుస్తీ 2 చితాల్లో కనిపించింది.
ఈ సినిమాల హీరోయిన్ పూజా హెగ్డే సీన్సే చాలావరకు తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హెచ్.వినోద్ చెప్పాడు. అలాంటిది ఆనందిత బాధపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమెని సపోర్ట్ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే 'జన నాయగన్' మూవీకి తొలిరోజు రూ.78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగులో వచ్చిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి ఈ చిత్రం రీమేక్ ఇది.
(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
Actress #Anandhi, who was in tears after watching #Vijay's #JanaNayagan in theatres yesterday, has openly expressed her sadness over the editing of her scenes in the film directed by #HVinoth. pic.twitter.com/RJcEnVfrQX
— Chennai Times (@ChennaiTimesTOI) July 24, 2026
Tags : 1