Breaking News

సాగుబడి: బత్తాయితో 'టీ' కూడా!

Published on Tue, 07/21/2026 - 08:33

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బత్తాయి తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం, కడప, నల్గొండ, మహబూబ్‌నగర్‌ వంటి పూర్వపు జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు విస్తరించాయి. గిట్టుబాటు కాకపోవటం, క్లైమేట్‌ ఛేంజ్, చీడపీడల దాడి తదితర సమస్యలతో కొన్ని జిల్లాల్లో బత్తాయి సాగు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితి.

మార్కెట్‌లో ధర బాగా తగ్గినప్పుడు బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతుండటాన్ని శివరామ్‌ దగ్గరగా గమనించారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించి, వారి ఆదాయ వనరులను పెంచాలనే ఆశయంతో శివరామ్‌ ‘సహస్తి సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట వినూత్న స్టార్టప్‌ను ప్రాంభించారు. బత్తాయి పంట ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.

శాస్త్ర, సాంకేతిక తోడ్పాటు
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ‘అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌’, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌– సీఎఫ్‌టీఆర్‌ఐ), బయో–నెస్ట్‌ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పరిశోధనా సంస్థల సాంకేతిక సహాయం, శాస్త్రీయ మార్గదర్శనంతో వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. బాలారిష్టాలను అధిగమించి తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటంలో విజయం సాధించారు.


పండులో ప్రతిదీ పనికొచ్చేదే..
బత్తాయి తోటల ఆధారంగా సరికొత్త ‘వాల్యూ యాడెడ్‌’ (విలువ ఆధారిత) వెల్‌నెస్‌ ఉత్పత్తులను తయారు చేసిన శివరామ్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. సాధారణంగా బత్తాయి పండును కేవలం జ్యూస్‌ తీసుకోవడానికే ఉపయోగిస్తారు, ఆ తర్వాత మిగిలిన తొక్కలను పారేస్తుంటారు. కానీ పండులోని ప్రతి భాగాన్నీ.. అంటే రసం, గుజ్జు, తొక్క, చివరికి విత్తనాలను కూడా వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ అనేక ఉత్పత్తులను తయారు చేశారు. ‘జీరో–వేస్ట్‌ సర్క్యులర్‌ ఎకానమీ’ వినూత్న మోడల్‌ను విజయవంతంగా ఆవిష్కరించారు.

ఈ సరికొత్త ప్రయోగాలలో అత్యంత ప్రజాదరణ ΄÷ందుతున్న ఆవిష్కరణలు ‘బత్తాయి ఇ¯Œ ఫ్యూజ్డ్‌ టీ క్యూబికల్స్‌’, బత్తాయి టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్‌ టీ ΄ûడర్‌. బత్తాయి తొక్కలను సౌర శక్తితో ఎండబెట్టి, బయోటెక్నాలజీ సాంకేతికత ద్వారా శుద్ధి చేస్తు్తన్నారు. దీనివల్ల సహజసిద్ధమైన సిట్రస్‌ ఫ్లేవర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌–సి, ముఖ్యమైన పోషకాలు నశించిపోకుండా 95% పైగా సురక్షితంగా ఉంటాయి. వీటితో పాటు బత్తాయి స్క్వాష్, అత్యవసర సుగంధ తైలాలు, ఫేస్‌ ΄ûడర్లు, న్యూట్రాస్యూటికల్‌ బయో–్ర΄÷డక్ట్స్‌ను కూడా శివరామ్‌ తయారు చేస్తున్నారు.  

రైతులకు అదనపు ఆదాయం
మార్కెట్‌లో బత్తాయి ధర కిలో ఆరు రూపాయలకు పడిపోయిన తరుణంలో సైతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓల) ద్వారా బత్తాయి తొక్కలను సేకరించి, వాటికి మంచి ధర చెల్లించటం ఈ ఆధునిక సాంకేతికత వల్ల సాధ్యమవుతోంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. నల్గొండ, అనంతపురం జిల్లాల పరిధిలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్‌ డీహైడ్రేషన్‌ ప్రక్రియలపై శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఈ ఉత్పత్తులను పాక్షికంగా ప్రాసెస్‌ చేయిస్తున్నారు. తద్వారా గ్రామీణ మహిళలకు పనుల్లేని కాలంలోనూ స్థిరమైన ఉపాధి లభిస్తోంది.

పర్యావరణ పరంగా కూడా ఈ ఆవిష్కరణ ఎంతో మేలు చేస్తోంది. సాధారణంగా కుళ్ళిపోయే బత్తాయి వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేయటం వల్ల ప్రమాదకరమైన మీథేన్‌ వాయువు విడుదలవుతుంది. ఈ వ్యర్థాలను సేకరించి వివిధ ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా వాయు కాలుష్యాన్ని అరికడుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తూ, అటు రైతులకు, ఇటు పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ ఆవిష్కరణ జాతీయ పురస్కారానికి ఎంపిక కావటం ప్రశంసనీయం.

బత్తాయి (చీనీ) తోటలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ గిట్టుబాటు ధర రాక రైతులు తరచూ ఇక్కట్ల పాలవుతున్నారు. బత్తాయి రైతుల కష్టాలకు ముఖ్య కారణం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చెయ్యకపోవటమే. ఈ దిశగా క్రియాశీలకంగా కృషి చేసిన ఒక స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో రైతుల ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఆయనే తెలంగాణకు చెందిన బండారు ఉషన్న శివరామ్‌.


అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివిన శివరామ్‌ అనేక సంవత్సరాలు కృషి చేసి బత్తాయి ఆధారిత వెల్‌నెస్‌ ఉత్పత్తుల సాంకేతకతలను ఆవిష్కరించి గ్రామీణ పారిశ్రామికవేత్తగా మారారు. ఆయన కృషికి జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్‌కు చెందిన ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎం)’ ద్వారా ఈ ఏడాది ఎంపికైన ‘గ్రామీణ ఆవిష్కర్త’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 31న న్యూఢిల్లీలో పురస్కారాన్ని అందుకోబోతున్నారు బలరామ్‌.

రైతులకు ఆదాయం... మహిళలకు ఉపాధి
బత్తా కాయలతో రసం ఒక్కటే పనికొచ్చేది అనుకోవటం వల్ల రైతులకు పెద్దగా ఆదాయం రావటం లేదని గుర్తించి.. వాల్యూ ఎడిషన్‌పై పరిశోధనలు చేపట్టాను. ప్రతిష్టాత్మక సంస్థల శాస్త్ర,సాంకేతికతల తోడ్పాటుతో బత్తాయితో ఆరోగ్యదాయకమైన టీ క్యూబికల్స్, టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్‌ టీ ΄÷డి, స్క్వాష్, సుగంధ తైలాలు, ఫేస్‌ ΄ûడర్లు, పోషకాలతో కూడిన బయో ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతలను ఆవిష్కరించాం. పైలట్‌ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే బత్తాయి రైతుల ఆదాయం సుమారు 20–35 శాతం వరకు పెంచాం.

గ్రామీణ మహిళల ద్వారా ఈ ఉత్పత్తులను తయారు చేయిస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. నీతి ఆయోగ్‌కు చెందిన ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎం)’ ద్వారా గ్రామీణ ఆవిష్కర్త జాతీయ పురస్కారాన్ని ఈ నెల 31న అందుకోనుండటం సంతోషంగా ఉంది. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో 5 వేల మందికి పైగా బత్తాయి రైతులకు లబ్ధి చేకూర్చటం, వందలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించటమే ధ్యేయంగా కార్యకలాపాలను దేశవ్యాప్త విస్తరణకు సిద్ధమవుతున్నాం.
– బండారు ఉషన్న శివరామ్‌ (99854 77736), వ్యవసాయ పట్టభద్రుడు, బత్తాయి ఉత్పత్తుల ఆవిష్కర్త

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)