Breaking News

బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయొచ్చా?

Published on Tue, 07/21/2026 - 08:20

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జులై ఆరంభంలో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. తదనంతరం సాగిన లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్‌), కీలక వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల వైఖరి వల్ల ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ అనిశ్చిత వాతావరణంలో సాధారణ మదుపరులు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై ఆర్థిక నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.

ధరల కదలికలు.. కారణాలు

యుద్ధం, ఆర్థిక అనిశ్చితి కాలంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యం ఇస్తారు. జులై నెలలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు మండిపోవడం వల్ల పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ అంచనాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు బంగారంలో కదలికలను పరిమితం చేశాయి. మరోవైపు, వెండి కేవలం సురక్షిత పెట్టుబడిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక డిమాండ్ (సోలార్, ఎలక్ట్రానిక్స్) కలిగిన లోహం కావడంతో రెసిస్టెన్స్‌ లెవల్స్‌ వద్ద కొంత ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.

ఇప్పుడేం చేయాలి?

దీర్ఘకాలిక మదుపరులు: ఇప్పటికే మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం, వెండి ఉంటే వాటిని వెంటనే విక్రయించాల్సిన అవసరం లేదు. భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం బంగారం రీ-రేటింగ్ అయ్యే అవకాశం ఉన్నందున హోల్డ్ చేయడం ఉత్తమం.

కొత్తగా పెట్టుబడి పెట్టేవారు: మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ప్రమాదకరం. ధరలలో దిద్దుబాటు వచ్చిన ప్రతిసారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌) విధానంలో సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్‌జీబీ-ప్రస్తుతానికి ప్రభుత్వం వీటిని తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ తీసుకొస్తే పెట్టుబడి పెట్టడం), గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా డిజిటల్ గోల్డ్ ద్వారా 5-10% మేర కేటాయింపులు చేసుకోవడం శ్రేయస్కరం.

స్వల్పకాలిక ట్రేడర్లు: ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేవారు గరిష్ట ధరల వద్ద కొంతమేర లాభాలను స్వీకరించి ‘స్టాప్ లాస్’ విధానాన్ని పాటించాలి.

అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు సమసిపోయే వరకు పసిడి, వెండి ధరల్లో అస్థిరత కొనసాగుతుంది. ప్రతికూల ఆర్థిక వాతావరణంలో ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పించే ఇంధనంగా పసిడి ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను కొనసాగించడమే మెరుగైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)