Breaking News

అందుకే అవార్డులు ఇవ్వ‌లేదా?

Published on Mon, 07/20/2026 - 20:17

జాతీయ చలనచిత్ర అవార్డులపై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. విజేత‌లు ఆనందోత్సాహాల్లో తేలియాడుతుంటే, పరాజితుల మ‌ద్ద‌తుదారులు అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతున్నారు. అవార్డుల ఎంపిక విశ్వ‌స‌నీయ‌త‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్త‌మ న‌టుడు అవార్డు ఎంపికపై పెద‌వి విరుస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, విక్రమ్‌ల‌కు అవార్డు ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు మ‌ల‌యాళ న‌టుడు చందు స‌లీంకుమార్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మంచి సినిమాల‌ను వ‌దిలేసి మామూలు చిత్రాల‌కు అవార్డులు క‌ట్ట‌బెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పాలక పక్షం వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను అవార్డులకు ఎంపిక చేశార‌ని వ్యాఖ్యానించారు.

మ‌మ్ముట్టితో పాటు కార్తీక్ ఆర్యన్‌ను ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక చేయ‌డంపై చందు స‌లీంకుమార్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. "జాతీయ అవార్డును అధికార పార్టీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందజేస్తున్నప్పుడు, దానికున్న హుందాతనాన్ని ఊహించండి. అయినా కూడా వారు మిమ్మల్ని (మమ్ముట్టి) విస్మరించలేకపోతున్నారు, ఎందుకంటే దేశంలోనే మీ నటన అత్యుత్తమమైనద"ని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా, 'బ్రహ్మయుగం' చిత్రంలో తన నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్' చిత్రానికి కార్తీక్ ఆర్యన్‌.. ఉత్తమ నటులుగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

సాధారణ సినిమాల‌కు అవార్డులా?
మంచి చిత్రాలను విస్మరించి, సాధారణ సినిమాల‌కు అవార్డులు ఇచ్చారని చందు స‌లీంకుమార్ విమ‌ర్శించారు. అధికార పార్టీతో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన వారికి పెద్ద‌పీట వేశార‌ని పేర్కొన్నారు. "ప్రతిభకు కాకుండా అధికార పార్టీకి దగ్గరగా ఉండటం వల్లే అవార్డులు వచ్చాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంటే, చరిత్ర కూడా వాటిని అలాగే గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వాలు మారినా అవార్డుల విలువ నిలిచి ఉండాలి. అవి కళాత్మక శ్రేష్ఠతకు నిదర్శనంగా నిలవాలి. ఒకవేళ ప్రజలకు వాటిపై నమ్మకం పోతే, ఆయా కాలాల్లోని అత్యుత్తమ చిత్రాలుగా చరిత్ర వీటిని గుర్తించద"ని ఘాటుగా వ్యాఖ్యానించారు.

'ఆడుజీవితం'కు మొండిచేయి
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (ఆడుజీవితం), చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తంగలాన్’ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో అవార్డులు రాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అవార్డుల జాబితా వెలువడిన వెంటనే #TheGoatLife, #Thangalaan హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. ‘ది గోట్ లైఫ్’కు ఒక్క అవార్డు కూడా రాక‌పోవ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ న‌ట‌న‌కు క‌చ్చితంగా బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఒక్క పుర‌స్కారం కూడా ద‌క్క‌క‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ‌కు గురిచేసింది. దీంతో సోష‌ల్ మీడియా వేదికగా గ‌ళం విన్పిస్తున్నారు. 'పుష్ప 2: ది రూల్', 'రాయన్' వంటి చిత్రాలకు అవార్డులు ప్ర‌క‌టించిన జ్యూరీ.. ఈ రెండు సినిమాల‌ను ఎందుకు విస్మ‌రించింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మెయ్యళగన్', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కిష్కింధ కాండం' వంటి చిత్రాలకు అవార్డులు ద‌క్క‌క‌పోవ‌డాన్ని కూడా ప్ర‌స్తావించారు.

అవార్డుల విశ్వసనీయతపై అనుమానాలు
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రానికి సరైన గుర్తింపు లభించక‌పోవ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ.. “జాతీయ అవార్డుల విశ్వసనీయత గతంలో ఉన్నంతగా ఇప్పుడు కనిపించడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. “#TheGoatLife ఒక్క అవార్డు కూడా గెలవకపోవడం ఎలా సాధ్యమైంది? పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్ర కోసం చేసిన కృషి అసాధారణం. ఆయనకు అవార్డు రాకపోయినా, ఆయన చేసిన నటనే ఒక అవార్డు లాంటిది” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని “మాస్టర్‌పీస్”గా అభివర్ణిస్తూ, పృథ్వీరాజ్ నటనను “ఐకానిక్ పెర్ఫార్మెన్స్”గా కొనియాడారు.

విక్ర‌మ్ అభిమానుల నిరాశ‌
‘తంగలాన్’ సినిమాలో విక్ర‌మ్ న‌ట‌న‌కు కూడా అవార్డు వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ ఆయ‌న‌కూ నిరాశ త‌ప్ప‌లేదు. దీంతో చియాన్ విక్రమ్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. “చియాన్ విక్రమ్‌ను మరోసారి విస్మరించారు. ఇది ఆయన నష్టం కాదు, జాతీయ అవార్డులకే పెద్ద లోటు” అని వారు వ్యాఖ్యానించారు. “తంగలాన్ కోసం విక్రమ్ తన శరీరాన్నీ, మనసునీ పూర్తిగా అంకితం చేశారు. సినిమానే జీవితంగా భావించి పనిచేశారు. అయినప్పటికీ ఆయనకు జాతీయ అవార్డు రాకపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం” అని భావోద్వేగంగా స్పందించారు. “కృషికి గుర్తింపు ఉండాలి. చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ కోసం చేసిన శ్రమ జాతీయ అవార్డుకు అర్హమైనది” అని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై న‌టుడు న‌రేశ్ ఆందోళ‌న‌

అందుకే అవార్డులు ఇవ్వ‌లేదా?
పృథ్వీరాజ్ సుకుమారన్, విక్ర‌మ్ సినిమాల‌కు అవార్డులు ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణాలు వేరే ఉన్నాయ‌ని అభిమానులు అంటున్నారు. లూసిఫర్‌కు సీక్వెల్‌గా పృథ్వీరాజ్ తెర‌కెక్కించిన ఎల్‌2- ఎంపురాన్ సినిమా కేంద్ర ప్ర‌భుత్వానికి గురైంది. దీంతో ఆయ‌న సంస్థ‌పై ఈడీ దాడులు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సినిమాకు అవార్డు ఇవ్వ‌కుండా ప‌క్క‌న‌పెట్టార‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక తంగలాన్ ద‌ర్శ‌కుడు ఫా. రంజిత్ కూడా మొద‌టి నుంచి అంబేద్క‌ర్ వాదాన్ని గ‌ట్టిగా వినిపిస్తూ, వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా సినిమాలు తీస్తున్నారు. బ‌హూశా ఈ కార‌ణంతోనే ఆయ‌న సినిమాకు అవార్డు రాలేద‌న్న అనుమానాన్ని అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ప్రాప‌గాండా సినిమాగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న హిందీ మూవీ 'ఆర్టికల్ 370'కి ఉత్తమ చలనచిత్ర పురస్కారం ద‌క్క‌డంతో కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్దేశం అర్థ‌యింద‌ని కామెంట్లు పెడుతున్నారు. 

 

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)