Breaking News

నాలుగు ఐపీఓలు.. రెండు లిస్టింగ్‌లు!

Published on Mon, 07/20/2026 - 13:07

ముంబై: దేశీ ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం కూడా ఐపీఓల సందడి జోరుగా కొనసాగనుంది. నేటి (జూలై 20)తో ప్రారంభమయ్యే ఈ వారంలో మెయిన్‌ బోర్డ్‌ విభాగంలో మొత్తం నాలుగు కొత్త పబ్లిక్‌ ఇష్యూలు ఓపెన్‌ కానున్నాయి. అలాగే  గత వారం ముగిసిన రెండు కీలక కంపెనీల షేర్లు లిస్ట్‌ కానున్నాయి. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) అయిన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ లిస్టింగ్‌ కోసం మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  

ఎస్‌బీఐ ఫండ్స్‌ మెగా లిస్టింగ్‌ 
గత వారం రూ. 9,813 కోట్ల భారీ ఐపీఓ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ షేర్లు జూలై 21న (మంగళవారం) ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఈ షేరు 16 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది.  

కాలిబర్‌ మైనింగ్.. శుక్రవారం 
మహారాష్ట్రకు చెందిన కోల్‌ మైనింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ ‘కాలిబర్‌ మైనింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌’ రూ. 450 కోట్ల విలువైన ఐపీఓ జూలై 21న ముగియనుంది. జూలై 24న (శుక్రవారం) ఈ షేరు మార్కెట్లో లిస్ట్‌ కానుంది. గ్రే మార్కెట్‌లో షేరు ధర ఏకంగా 27 శాతం ప్రీమియంతో దూసుకుపోతుండటం విశేషం.

కొత్త ఇష్యూలు.. 
క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌ ఇన్విట్‌: ఈ పబ్లిక్‌ ఇష్యూ జూలై 22న ప్రారంభమై, జూలై 24న ముగియనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో రూ. 5,000 కోట్లను సేకరించనుంది. దీని ధరల శ్రేణి రూ. 151–152.  
ఇండో–ఎమ్‌ఐఎమ్‌: బెంగళూరుకు చెందిన ఈ ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది.  
లోహియా కార్ప్‌: కాన్పూర్‌కు చెందిన ఈ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మెషినరీ తయారీ సంస్థ ఐపీఓ జూలై 23–27 మధ్య ఉంటుంది.   
ఎక్స్‌ట్రానెట్‌ టెక్నాలజీస్‌: ఐటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయిన ఈ సంస్థ రూ.170 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో జూలై 23న మార్కెట్లోకి వస్తోంది. దీని ధరల శ్రేణి రూ.120–127గా ఉంది.

Videos

రాహుల్ కి ముక్కు నుంచి రక్తస్రావం

నేడు పొగాకు రైతులతో YS జగన్ భేటీ

హైకోర్టులో AP పోలీసులకు బిగ్ షాక్

కొడుకు ముందు మూత్రం పోసేలా కొట్టడం ఏంటండీ..

చంద్రబాబు ఇంటిదగ్గరే.. శవం కూడా ఎక్కడుందో కూడా తెలీదు

నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే.. రాయపాటి శైలజ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అడ్వకేట్ రజిని

మీరు నన్ను ఏమైనా చేసుకోండి.. నేను అనితపై ఎలాంటి అసభ్యమైన వ్యాఖ్యలు చేయలేదు

30 సంవత్సరాల నుంచి TDP అంటే ప్రాణమిచ్చా.. టీడిపీ నేత సంచలన వ్యాఖ్యలు

ట్రైనీ IPS ఉదయ్ కేసులో కీలక మలుపు

వివస్త్రను చేసి.. మూత్రం పోసేలా కొట్టి.. కాస్తయినా సిగ్గుండాలి..

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)