Breaking News

పీక్‌ సీజన్‌లో హోటళ్లు చవకగా బుక్‌ చేసుకోవాలంటే...

Published on Mon, 07/20/2026 - 10:49

సెలవులు, పండుగలు, లాంగ్‌ వీకెండ్లు... ఇలా పీక్‌ సీజన్‌ లో ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చే సమస్య హోటల్‌ ధరలే. అదే గది సాధారణ రోజుల్లో ఒక ధర ఉంటే, పీక్‌ సీజన్‌ లో మరో ధర ఉంటుంది. అయితే కొంచెం తెలివిగా ప్లాన్‌ చేస్తే 20 నుంచి 40 శాతం వరకు డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ 12 సులభమైన చిట్కాలు ఉపయోగపడతాయి.

1. సరైన సమయంలో బుకింగ్‌ చేయండి..
వారం మధ్యలో, ముఖ్యంగా డిమాండ్‌ తక్కువగా ఉండే సమయంలో ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు ధరలు పరిశీలించి బుక్‌ చేయండి.

2. వ్యక్తిగత బ్రౌజింగ్‌ లేకుండా వెతకండి..
ఒకే హోటల్‌ను పదేపదే వెతికితే ధరల్లో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగత బ్రౌజింగ్‌ సమాచారం లేకుండా లేదా మరో పరికరం ద్వారా కూడా ఒకసారి ధరలు పరిశీలించండి.

3. ప్రధాన ప్రాంతం కాకుండా..
పర్యాటక ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న హోటళ్లు ఖరీదుగా ఉండే అవకాశం ఎక్కువ. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరకొచ్చు.

4. వారాంతపు రోజులను వీలైతే ఎవాయిడ్‌ చేయండి..
శని, ఆదివారాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు సోమవారం నుంచి గురువారం మధ్య బుకింగ్‌ చేసుకునేలా ప్రయాణ ప్రణాళిక రూపొందించండి.

5. హోటల్‌తో నేరుగా మాట్లాడండి..
ఆన్‌ లైన్‌ లో కనిపించిన ధరను ప్రస్తావిస్తూ హోటల్‌కు నేరుగా ఫోన్‌ చేస్తే కొన్నిసార్లు అదే ధరకు లేదా ఇంకా తక్కువకు గది ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎర్లీ చెకిన్‌ లేదా లేట్‌ చెకిన్‌ చేసే సౌకర్యం కూడా లభించవచ్చు.

6. ఫుడ్‌ ఉన్న ప్యాకేజీలను ఎంచుకోండి..
గదితో పాటు అల్పాహారం లేదా రాత్రి భోజనం కలిపి ఇచ్చే ప్యాకేజీలు ఎంచుకుంటే విడిగా ఖర్చు చేయడంకంటే చవకగా ఉండొచ్చు.

7. ఫిల్టర్‌ కరెక్టుగా చేయండి..
మంచి రేటింగ్, సరైన ప్రదేశం, తక్కువ ధర వంటి ప్రమాణాలతో హోటళ్లను ఫిల్టర్‌ చేసుకుంటే చూసుకుంటే మంచి వసతి సులభంగా దొరుకుతుంది.

8. ముందుగానే బుక్‌ చేసుకోండి..
ప్రయాణ తేదీ ముందే ఖరారైతే కనీసం రెండు నెలల ముందే బుక్‌ చేసుకోవడం మంచిది. ఫ్రీ కేన్సిలేషన్‌ సౌకర్యం ఉన్న రూమ్‌ని ఎంచుకుంటే తరువాత ధర తగ్గినప్పుడు మళ్లీ బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

9. హోటల్‌కు వెళ్లిన తర్వాతే చెల్లించండి..
ఇలా చెకిన్‌ చేసిన తరువాత పే చేసే అవకాశం ఉంటే ధరలు, రూల్స్‌ చెక్‌ చేయండి. అయితే ముందుగా పక్కాగా చెల్లించాలా లేదా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

10. ఆఫర్లను యూజ్‌ చేసుకోండి..
వివిధ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, బ్యాంకులు, యూపీఐ సేవలు అందించే ఆఫర్లు,  కూపన్లు, రివార్డ్‌ పాయింట్లను ఉపయోగించుకుంటే మరింత ఆదా చేయవచ్చు.

11. రద్దీ సమయంలో వద్దు..
సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువ మంది బుకింగ్‌ చేయడం వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు. వీలైతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ముందుగానే బుకింగ్‌ ప్రయత్నించండి.

12. నియర్‌ బై టౌన్స్‌ చెక్‌ చేయండి
ప్రధాన ప్రాంతంలోని హోటళ్లు పూర్తిగా నిండిపోయినప్పుడు సమీప పట్టణాలు లేదా శివారు ప్రాంతాల్లో వెతికితే తక్కువ ధరకే మంచి వసతి దొరికే అవకాశం ఉంటుంది.

చివరగా...
ఒకే వెబ్‌సైట్‌పై ఆధారపడకుండా కనీసం రెండు లేదా మూడు బుకింగ్‌ వేదికల్లో ధరలను పోల్చండి. హోటల్‌ రివ్యూలు, కేన్సిలేషన్, అదనపు ఛార్జీలను పరిశీలించిన తర్వాతే బుకింగ్‌ చేయండి.

Videos

రాజీనామా చేసేంత వరకు నిరసన కొనసాగుతుంది..!

హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!

నోరు తెరిచి మాట్లాడు! పవన్ పై వరుదు కల్యాణి సీరియస్

బుడోడు రీఎంట్రీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

ఆస్పత్రిలో వాంగ్ చుక్.. బయట సీజేపీ నిరసన.. టెన్షన్ టెన్షన్

సీదిరి అప్పలరాజును పరామర్శించారు YSRCP నేతలు

జంగల్ పాలనకు ముగింపు తప్పదు బయటపడ్డ గల్లా మాధవి, జత్వానీ అసలు రంగు

ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇదిగో ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోవద్దు ఇంతకుఇంత అనుభవిస్తారు

Photos

+5

ప్రియురాలిని పరిచయం చేసిన యంగ్ హీరో ఫోటోస్ వైరల్

+5

హైదరాబాద్‌ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హీరోయిన్ కంటే అందంగా చెన్నై లవ్ స్టోరీ యాంకర్ చర్మిలా (ఫోటోలు)

+5

చెల్లి సితార, ఫ్రెండ్స్‌తో మహేశ్ కొడుకు గౌతమ్ ట్రిప్ (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’ విజయవంతం (ఫొటోలు)

+5

విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)

+5

రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)