Breaking News

కుమారుడి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..! కన్నీటి సంద్రంలో తండ్రి

Published on Wed, 07/15/2026 - 16:33

తలిదండ్రులు తమ పిల్లల చదవుల కోసం, వారి ఉన్నతి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమ పడతారు. ఆ బిడ్డ ప్రయోజకుడై వాళ్ల కష్టాన్ని గుర్తించి..కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగితే..ఆ పేరెంట్స్‌కి మించిన అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. అలాంటి ఆనందాన్నే తిరిగి ఇచ్చాడు కేరళకు దీప్‌ నీలమ్‌. అంతేగాదు కుమారుడి ఊహించని చర్యకు ఆ తండ్రి కళ్లల​‍లో నీళ్లు తిరిగాయ్‌.

అసలేం జరిగిందంటే..కేరళకు దీప్‌ నీలిమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్‌ చేసిన వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంది. ఆ వీడియోలో తనను ఎప్పటికీ వీడిపోని జ్ఞాపకాలతో మొదలవుతుంది. అతన పాఠశాలలో చదువుతున్నప్పుడు తన తండ్రి తాను ఎప్పటికీ ఎస్‌యూవీని కొనని అమ్మతో చెప్పడం విన్నానని చెప్పుకొచ్చాడు.ఎందుకంటే తన చదువుకి పెట్టుబడి కోసం తక్కువ ఖరీదైన కారుతో సరిపెట్టుకున్నట్లు తెలిపాడు. అయితే తాను కచ్చితంగా ఆయన పదవీవిరమణ సమయానికి తన డ్రీమ్‌ వాహనాన్ని కొంటానని తండ్రికి వాగ్దానం చేసినట్లు చెప్పుకొచ్చాడు నీలిమ్‌. 

ఆరోజు నుంచే తన తండ్రి కోరికను ఎలాగైన నెరవేర్చాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యాడట. అయితే అనుకోకుండా తన జీవితం కాస్త ముందుగానే ఆ అవకాశం ఇచ్చిందని చెప్పాడు. తాను ఐఐఎం కోజికోడ్ నుంచి పట్టభద్రుడైన కేవలం ఆరు నెలలకే, తన చిన్ననాటి వాగ్దానం నిజం చేసుకోగలిగానని ఆనందంగా చెప్పాడు. ఎందుకంటే తాను కేపీఎంజీలో జాబ్‌ సంపాదించడంతో అది సులభమైందని అన్నాడు. 

అందుకే తన తండ్రి కోరికను నెరవేర్చిన క్షణం చిరస్మరణీయం ఉండేలా టెస్ట్ డ్రైవ్ చేద్దామనే నెపంతో ఆయనను ఒక కార్ షోరూమ్‌కు తీసుకువెళ్లినట్లు చెప్పాడు. ఆ ఎస్‌యూవీ వాహనం చూశాక గానీ ఆ తండ్రికి తెలియలేదు అప్పటికే కొడుకు ఆ కారుని కొనుగులు చేసినట్లు. అంతే ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

అంతేగాదు నీలమ్‌ ఇది తనకు జాబ్‌ ఆఫర్‌, ప్రమోషన్‌ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. పైగా నీలమ్‌ ఆ వీడియోకి తమ కలల కన్నా పిల్లల కలలకే ప్రాధాన్యత ఇచ్చే ప్రతి తల్లిదండ్రులకు తలవంచి నమస్కరిస్తున్నా అని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశాడు. నెటిజన్లు నీలమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ఈ పోస్ట్‌ మా పేరెంట్స్‌ త్యాగాలను గుర్తు చేసిందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: స్లోవేకియా నాయకుడు రిచర్డ్‌ 'థేకువా స్వీట్'రుచి‌కి ఫిదా! ఎలా తయారు చేస్తారంటే..)
 

#

Tags : 1

Videos

ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు

బాబుకు పవన్ బిగ్ షాక్

విశ్వసనీయత లేని బాబు మాటలు

మీరు రావొద్దు... ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు...

CI వేధింపులు తట్టుకోలేక పుట్టినరోజు నాడే

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రెండో వన్డే నుంచి గిల్ ఔట్?

సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు

నేను విన్నాను...!. నేను ఉన్నాను..!

ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన అంబటి

బిజ్లీ మహాదేవ్ అసలు రహస్యం! సైన్స్ కు అర్థంకాని శివుడి మహిమ

Photos

+5

రాధిక భర్త శరత్‌కుమార్ బర్త్ ‍డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

కొరియన్ అమ్మాయితో మహేశ్ మేనల్లుడి పెళ్లి సందడి (ఫొటోలు)

+5

ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్‌ జగన్‌ భీమవరం పర్యటన (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)

+5

జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పింక్ శారీలో బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్‌ అందాలు.. ఫోటోలు

+5

ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు

+5

కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)