ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు
Breaking News
స్టార్ హీరో ఇంట్లోకి ఏలియన్స్.. వీడియో వైరల్
Published on Wed, 07/15/2026 - 13:51
హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆస్కార్ నామినీ జేమ్స్ ఫ్రాంకో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్ ఇంట తీవ్ర దుమారం రేపుతోంది. తన కొత్త టిక్‌టాక్ ఖాతా ద్వారా ఆయన పంచుకున్న ఈ వీడియోలో... ఏలియన్స్ తనను అనుసరిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఫ్రాంకో మానసిక స్థితి బాగుందో లేదోనంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
జులై 13న జేమ్స్ ఫ్రాంకో తాను ఒక పెద్ద సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించబోతున్నట్లు ప్రకటించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు.ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలో.. తన ఇంట్లో కొన్ని వింత విషయాలను కనుగొన్నట్లు చెప్పారు. ఇది తనకు ఇష్టం లేకపోయినా తనపై బలవంతంగా రుద్దబడిందని పేర్కొన్నారు. నిజాలు బయటపెట్టకుండా ఉండేందుకు తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, ప్రజలు తనను పిచ్చివాడిగా ముద్ర వేస్తున్నారని ఫ్రాంకో ఆరోపించారు.
ఆ వీడియోలో ఏముంది?
ఫ్రాంకో తన ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేసిన కొన్ని 'బ్లాక్ అండ్ వైట్' దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. అందులో ఒక ఏలియన్ చెట్టు వెనుక దాక్కుని, కిటికీ గుండా లోపలికి చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా, ఆ జీవి యొక్క పొడవైన వేళ్లు కిటికీపై నొక్కుతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా అందులో రికార్డ్ అయ్యాయి.
ఫేక్ వీడియో
ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దీన్ని అస్సలు నమ్మడం లేదు.‘ఇది పూర్తిగా నకిలీ వీడియో. హాలోవీన్ దుకాణం నుండి కొనుగోలు చేసిన ఒక చౌకైన మాస్క్‌ను ఎవరో ధరించి ఈ డ్రామా ఆడుతున్నారు’ అని విమర్శకులు కొట్టిపారేస్తున్నారు.మరికొందరు, ఈ వీడియోను ఇంకాస్త స్పష్టంగా చూడాలంటే తమ ఛానెల్‌కు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కోరడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. డబ్బులు సంపాదించడానికి ఇదొక మోసపూరిత చర్య అని ఫైర్ అవుతున్నారు.
సినిమా ప్రమోషన్స్ కోసమా?
'127 అవర్స్' వంటి అద్భుతమైన చిత్రంతో ఆస్కార్ నామినేషన్ అందుకున్న జేమ్స్ ఫ్రాంకో లాంటి నటుడు ఇలాంటి చౌకబారు పనులు ఎందుకు చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, త్వరలో విడుదల కానున్న ఆయన సరికొత్త చిత్రం 'లవ్ మీట్స్ ఇన్ ది సన్‌షైన్' ప్రమోషన్లో భాగంగానే ఈ 'పబ్లిసిటీ స్టంట్' చేసి ఉంటారని సినీ పరిశ్రమలో గట్టిగా చర్చ నడుస్తోంది. గతంలో కూడా ఫ్రాంకో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దాఖలాలు ఉన్నాయి.
James Franco Drops His Alien Footage.
Crystal clear alien in 4k.
James Franco poker face.
Either the footage is real or James Franco lost his mind. pic.twitter.com/dDksbGShbe— Good Morning UFO (@goodmorningufo) July 13, 2026
Tags : 1