Breaking News

కలుషిత ఆహారం.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు నోటీసులు

Published on Sat, 07/11/2026 - 15:17

ప్రముఖ క్విక్‌-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన నాణ్యత ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థకు ఫుడ్ రెగ్యులేటర్ ఏకంగా 9 నోటీసులను జారీ చేసింది. కాలం చెల్లిన, కలుషితమైన, సురక్షితంకాని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు అందినట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

లోపభూయిష్ట సేవలు.. కస్టమర్ల ఆగ్రహం

ఇటీవలి కాలంలో క్విక్ కామర్స్ యాప్‌ల ద్వారా నిమిషాల వ్యవధిలో నిత్యావసరాలు, ఆహార పదార్థాలను డెలివరీ పొందే ధోరణి మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగింది. అయితే, వేగంగా డెలివరీ చేయాలనే తపనలో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులలో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నట్లు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. అందులో..

  • ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన పాలు, బ్రెడ్, ప్యాక్డ్‌ ఫుడ్స్ సరఫరా చేయడం.

  • కొన్ని ప్యాకెట్లలో పురుగులు రావడం, కూరగాయలు/పండ్లు కుళ్లిపోయి ఉండటం.

  • నిల్వ ఉంచే ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడం.

నోటీసుల్లో ఏముంది?

వినియోగదారుల రక్షణ చట్టాలు, ఆహార భద్రత చట్టాల ప్రకారం ఈ లోపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఫుడ్ రెగ్యులేటర్ స్విగ్గీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

1. పంపిణీ కేంద్రాల్లో(డార్క్‌ స్టోర్స్‌) నిల్వ పద్ధతులు ఎలా ఉన్నాయి?

2. క్వాలిటీ చెకింగ్ కోసం ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు?

3. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలు ఏమిటి?

ఈ విధమైన తొమ్మిది నోటీసులకు సంబంధించి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నిర్దేశిత గడువులోగా అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాలతో పాటు సదరు డార్క్ స్టోర్ల లైసెన్సులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ఆర్డర్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వస్తువు డెలివరీ అయిన వెంటనే ప్యాకెట్‌పై ఉన్న ఉత్పత్తి తేదీ, ఎక్స్‌పైరీ తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఎలాంటి లోపాలున్నా వెంటనే సదరు ప్లాట్‌ఫారమ్‌తో పాటు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.

ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు