Breaking News

మనిషి పతన దశలు

Published on Sat, 07/11/2026 - 11:40

స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది.

నైతిక పతనం..
మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం చేసినవారికి ద్రోహం తలపెట్టడం, తిన్న ఇంటి వాసాలు లెక్కించడం జరుగుతుంది.

విలువల పతనం..
దురాశ, దురలవాట్లు ఎక్కువవుతాయి. ఎలానైనా తాము కోరు కున్నది పొందడానికి అడ్డదారులు వెతుకుతారు.

సామాజిక పతనం..
మనిషి సామాజిక ప్రాణి అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. తన గురించి ఈ లోకం ఏమి అనుకుంటుందనే భయం ఉండదు. వావి వరసలు చూడరు. స్వార్థం తలకెక్కుతుంది. తను చేసిందే సరైనది అనే భావనతో దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.

ఆర్థిక పతనం..
తనువెల్లా అహంతో నిండిన మనుషులకు ఆర్థిక పతనమే ఆఖరి దశ. ఆర్థిక పతనం మొదలైన తర్వాత క్రమంగా పశ్చాత్తాప లక్షణాలు అంకురిస్తాయి. అందులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పులను సరిదిద్దుకుని కొత్త జీవితాలను మొదలెడతారు. ఎక్కువ శాతం మంది అహం మత్తు నుండి బయటపడకుండా జీవితాలనే బలి చేసుకుంటారు.

అందుకే మనుషులు ముందుగా నైతికంగా పతనం చెందకూడదు. విచక్షణా జ్ఞానం కోల్పోకూడదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని అడుగులు వేయాలి. కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అనే సత్యాన్ని విస్మరించకూడదు.
– దుర్గమ్‌ భైతి

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు