Breaking News

'సలాం సాబ్‌'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు!

Published on Sat, 07/11/2026 - 11:40

కొన్ని మనసుకు తాకే కొంగొత్త విషయాలు చూస్తే..స్ఫూర్తిదాయకమైన పాటలను గుర్తుకుతెస్తాయి. అందుకు నిదర్శనం  పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన పోస్ట్‌. ఎప్పటిలానే ఈ సారి ప్రేరణ కలిగించే కథతో మనముందుకు వచ్చారు. అయితే ఈ పోస్ట్‌ అత్యంత ప్రత్యేకం, అందర్నీ చైతన్యపరిచే గొప్ప విషయం కూడా. ఇంతకీ ఆయన పోస్ట్‌లో ఎవరి గురించి రాసుకొచ్చారంటే..

మన పరిసరాలను, నగరాలను దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. కానీ మనం తరచుగా విస్మరించే విషయాల విలువను గుర్తు చేసేలా ఒక వ్యక్తి దృఢ సంకల్పం కనులముందు కనిపించేంత వరకు తెలియదు. అలాంటి వ్యక్తే ఈ 80 ఏళ్ల ఐరిష్‌ వ్యక్తి కారోన్ రాన్స్‌లీ . పదేళ్లకు పైగా గుర్తింపుకు నోచుకోని మెట్లబావులను శుభ్రం చేస్తూ సాంప్రదాయ నీటి నిర్మాణాల పట్ల తిరిగి చూసేలా అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానికంగా "పాగల్ సాబ్"గా పిలిచే రాన్స్‌లీ నిర్లక్ష్యానికి గురైన మెట్లబావులు, మెట్టు కలిగిని నీటి కుంటల తదితర నిర్మాణాలను తన స్వహాస్తాలతో పునరుద్ధరించారు. ఆయన నిస్వార్థ సేవ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌మహీంద్రాను సైతం కదిలించింది. 

ఆ మహానుభావుడి కృషికి ఫిదా అవ్వతూ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. చాలా మంది జోధ్‌పూర్ పురాతన మెట్ల బావుల అందాన్ని చూసి మురిసిపోతుంటారే తప్ప..రాన్స్‌ లీ మాదిరిగా కనుమరుగైపోయేలా అధ్వాన్నంగా ఉన్న వాటి స్థితిని గుర్తించారు. ఆయన అద్భుతమైన వాస్తు శిల్పం, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆ నీటి బావులు వ్యర్థాలతో నిండిపోయి..వాటివైపు కన్నెత్తి చూడలేని స్థితిలో ఉన్న వాటిని చూసి చలించిపోయారు అయితే ఆయన తాను ఒక పర్యాటకుడిలా చూసి వెళ్లిపోవాలని అనుకోకపోవడం విశేషం.

వాటిని పునరుద్ధరించే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించకోవడమే గాక ఆ దిశగా చర్యలు చేపట్టారు. అలా మొత్తం పదేళ్లు ఆ మెట్లబావుల సంరక్షణకే తన జీవితాన్ని అంకితం చేశారంటూ సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు వారసత్వ సంపదను పరిరక్షించడానికి నిపుణులుగా లేదా ఒకే ప్రదేశానికి చెందినవారై ఉండాల్సిన అవసరం లేదని చెప్పే సంఘనట ఇది అన్నారు. అంకితభావం ఉన్న ఎవరైనా భారతదేశంలోని చారిత్రక కట్టడాలను పరిరక్షించడంలో తన వంతు సహకారం అందించగలరని అన్నారు. 

ఈ సందర్భంగా ప్రసిద్ధ చాంద్‌బావిని పరిరక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ..భారతదేశం అంతటా ఉన్న వాలంటీర్లు, పర్యావరణ పరిరక్షకులు, ఎన్జీవోలు, గ్రామీణ సంఘాలు ఇలాంటి చారిత్ర కట్టడాల కోసం చేస్తున్న కృషిని గుర్తుకుతెచ్చుకున్నారు. అంతేగాదు జోధ్‌పూర్‌ పై రాన్స్‌ లీకి ఉన్న ప్రేమకు, వారసత్వం పట్ల ఉన్న నిస్వార్థ సేవకు, అభిరుచికి మనస్ఫూర్తిగా సెల్యూట్‌ చేస్తున్నా.. ఆయన పని ఇంతటితో ఆగకూడదు అంటూ పోస్ట్‌ని ముగించారు. నెటిజన్లు కూడా ఆ ఐరిష్‌ వ్యక్తి నిబద్ధతను, నిస్వార్థంగా చేస్తున్న అతడి ప్రయత్నాలను కొనియాడారు

మెట్ల బావుల ప్రాముఖ్యత..
మెట్లబావులు కేవలం రాతితో కట్టిన పాత కట్టడాలు మాత్రమే కాదు. శతాబ్దాలుగా, ముఖ్యంగా నీటి కొరత ఎప్పుడూ ఒక సవాలుగా ఉన్న రాజస్థాన్ వంటి ప్రాంతాలలో, ఇవి కీలక పాత్ర పోషించాయి. మెట్ల బావులు కేవలం నీటి వనరులుగానే కాకుండా, ప్రజలు సమావేశమై.. ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకునే ప్రదేశాలుగా కూడా మారాయి. ఇవి ఆ కాలంలోని టెక్నాలజీ, నాటి తరం వారి ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు కొలమానం. 

కాగా, రాన్సీలీ ఒక మీడియా ఇంటర్వ్యూలో తన ప్రయత్నం గురించి ఇలా వివరించారు. తాను 2014లో జోధ్‌పూర్‌కి వచ్చినప్పుడు ఈ అందమైన మెట్లబావులను చూశానని చెప్పారు. అయితే వాటిలో కొన్ని నీటి నిల్వ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకోవడం చూసి దిగ్బ్రాంతి చెందానన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రదేశాలను శుభ్రంచేసి మంచి స్థితిలోకి వచ్చేలా తన వంతు కృషిని చేశానని అన్నారు. ఇదంతా తన స్వహస్తాలతోనే  చేశానని తెలిపారు..

(చదవండి: ప్లీజ్‌ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..)

 

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు