Breaking News

ఆమె ఎంట్రీతో ఫ్యాషన్‌ వేదికగా టెన్నిస్‌ కోర్టు..!

Published on Tue, 06/30/2026 - 14:06

కొందరు నిర్భయంగా తమ టాలెంట్‌ని, ఫ్యాషన్‌ని ఒకేసారి ప్రదర్శిస్తారు. పైగా ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. అచ్చం అలానే చేసింది జపాన్‌ ప్రఖ్యాత క్రీడాకారిణి నవోమి ఒసాకా. ఒక్కసారిగా అది టెన్నిస్‌ కోర్టా? లేక ఫ్యాషన్‌ వేదిక? అని విస్తుపోయేలా చేసింది ఆమె ఎంట్రీ. అసలేం జరిగిందంటే..

అందరూ ఆసక్తికగా చూస్తూన్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ 2026లో జపాన్‌ స్పోర్ట్స్‌ స్టార్‌ నవోమి ఒసాకా ఎంట్రీ అదిరిపోయింది. ఆమె ఆ టెన్నిస్‌ కోర్టుని ష్యాషన్‌ వేదిగకగా మార్చేసింది. అంత అద్భుతమైన లుక్‌తో అలరించింది. క్రీడాకారుణులు టెన్నిస్‌ కోర్టుకి ఎలా వస్తారో తెలిసిందే. కానీ ఒసాకా..పూర్తి తెలుపు రంగు దుస్తులతో వచ్చి..అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. 

నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఆమె జపనీస్‌ సంప్రదాయ కిమోనో దుస్తులతో అలరించింది. ఈ దుస్తులను టోక్యోకు చెందిన డిజైనర్‌ హానా యాగి రూపొందించారు. సున్నితమైన వస్త్రం అందులో సీక్వెన్స్‌డ్‌ కలర్‌లోనే ఎంబ్రాయిడరీ చేసిన కొంగలు, చెర్రీ పువ్వులు, ముత్యాలు పొందుపర్చారు. సాంప్రదాయ శైలిలో కుట్టిన మెడ, వదులుగా ఉండేలా చేతుల భాగం, ఇక నడుముకి చిత్రమైన విల్లు ఆకారపు అలంకరణలతో కూడిన సాంప్రదాయ జపనీస్ ఓబీ బెల్ట్‌ని ధరించింది. 

ఆమె సాంప్రదాయ కంజాషి కేశాలంకరణ ఆభరణం, మికిమోటో ఆభరణాలతో తన రూపాన్ని పూర్తి చేసింది. ఈమేరకు ఒసాకా తన వేషధారణ గురించి మాట్లాడుతూ.."తనకు జపాన్‌ వారసత్వం ముఖ్యమని, వింబుల్డన్‌లో అంతా తెలుపు రంగు దుస్తులనే ధరించాలన్నారు. అందుకే ఇలా కిమోనోలో వస్తే బాగుంటుందని అనుకున్నాను, తనకు ఇష్టమైన సినిమా 'కిల్ బిల్',అందులోని లూసీ లియు పాత్ర ఓ-రెన్ ఇషీ మాదిరిగా ఇలా తెల్ల కిమోనో ధరించాను". అని వెల్లడించింది. 

అంతేగాదు ఒసాకా ఆ దుస్తులతో టెన్నిస్‌ కోర్టులోకి అడుగు పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున అరుస్తూ..తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పైగా ఆమె ఫ్యాషన్‌ శైలిని అభినందిస్తూ.. ఒసాకా నువ్వు క్రీడాశైలిని, సంస్కృతిని ఒకే వేదికపై భలే చూపించావంటూ ప్రశంసించారు. 

 

(చదవండి: ఐఐటీ డ్రాపౌట్‌ అయినా..మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లో ఉద్యోగం!)
 

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)