TG హైకోర్టులో ప్రైవేట్ కాలేజీలకు ఊరట
Breaking News
‘ధర్మన్’ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్.. కొత్త సినిమాపై హైప్ పెంచిన రజనీకాంత్
Published on Thu, 06/25/2026 - 09:34
కమల్‌హాసన్, రజనీకాంత్‌లది సుమారు 50 ఏళ్ల స్నేహ బంధం. కెరీర్ ఆరంభించిన కొత్తలో వీరిద్దరూ కలిసి 10 చిత్రాలకు పైగా నటించారు. అలాంటిది ఇప్పుడు కమల్‌హాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంట ర్నేషనల్‌పై నిర్మిస్తున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండటం విశేషం. బుధవారం ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలోని కమల్‌హాసన్ కార్యాలయంలో జరిగింది. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, రజనీకాంత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో... ఈ చిత్రానికి ముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారనే వార్త వచ్చింది. ఆ తర్వాత డైరెక్టర్‌గా సుందర్ .సీని ఖరారు చేశారు. అయితే ఈ చిత్రం నుంచి సుందర్ తప్పుకున్నారు. దాంతో దర్శకుడిగా శిబి చక్రవర్తి పేరు వినిపించింది. చివరికి యువ దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరును ఖరారు చేశారు.
ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్ తన సంస్థలో సినిమా చేయాలని కోరారు. అయితే కథ వినను అన్నారు. నన్నే ఎంపిక చేసుకోమని భారమంతా నాపై పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కథ ఎంపికలో మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పడంతో విన్నారు. ఆ తర్వాత ఈ కథను ఓకే చేశాం. ఇది 5 రూపాయల వైద్యుడి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం కాదు. స్వొగ్ అనే వైద్యుడి ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇందులో నేను న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసే సైంటిస్ట్‌గా కనిపిస్తాను. ఆఫ్గనిస్థాన్, రష్యాలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఇది తీయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే చివరకు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు’ అని చెప్పారు.
కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నేను, రజనీకాంత్ సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత ఆ కల నిజమవుతోంది. మా సంస్థలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. దర్శకుడు అశ్వద్ మారిముత్తు, సంగీత దర్శకుడు అనిరుధ్‌తో పాటు మొత్తం టీమ్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు. అశ్వద్ మారిముత్తు మాట్లాడుతూ – ‘‘రజనీకాంత్‌గారితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటారు. ఆ చాన్స్ నాకు రావడం హ్యాపీగా ఉంది. రజనీకాంత్‌గారు నటించిన ‘పడయప్పన్’, కమల్‌హాసన్‌గారు నటించిన ‘వేట్టైయాడు విలైయాడు’ చిత్రాల తరహాలో ‘ధర్మన్’ ఉంటుంది’’ అని తెలిపారు.
Tags : 1