జగన్ గురించి ఇంకోసారి పిచ్చిగా వాగితే.. నీ ఇంటికొచ్చి మాస్ వార్నింగ్
Breaking News
మరో ఆఫర్ కొట్టేసిన బేబి
Published on Tue, 06/23/2026 - 09:00
'బేబి' సినిమా అనగానే హీరోయిన్ వైష్ణవి చైతన్య గుర్తొస్తుంది. ఒక్క మూవీనే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినప్పటికీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఫోకస్ అంతా తమిళంపై పెట్టింది. ఇంతకు ముందే అజిత్ హీరోగా నటించిన 'వలిమై'తో తమిళ ఎంట్రీ ఇచ్చింది కానీ అందులో చిన్న పాత్ర మాత్రమే చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది.
సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు జంటగా వైష్ణవి నటిస్తోంది. చిత్రమైన సినిమాలు తీసే విఘ్నేష్ కార్తీక్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన ఇంతకు ముందు తిట్టం ఒండ్రు, అడియే, హాట్ స్పాట్ 1,2 మూవీస్ తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే చైన్నెలో ప్రారంభమై తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ దీనిని పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడట. మరోవైపు ఆర్య హీరోగా నటిస్తున్న సినిమాలోనే వైష్ణవి చైతన్య ఓ హీరోయిన్‌గా చేస్తోంది.
Tags : 1