జగన్ గురించి ఇంకోసారి పిచ్చిగా వాగితే.. నీ ఇంటికొచ్చి మాస్ వార్నింగ్
Breaking News
సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!
Published on Mon, 06/22/2026 - 21:08
రెనాల్ట్ ఇండియా తన సరికొత్త డస్టర్ ఎస్‌యూవీ ఎగుమతులను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 750 డస్టర్ వాహనాలను చెన్నై ప్లాంట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. రాబోయే నెలల్లో మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ మోడల్‌ను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
కొత్త డస్టర్ భారతదేశంలో తొలిసారిగా రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ రకాల పవర్‌ట్రెయిన్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా.. అన్ని వేరియంట్లు, పవర్‌ట్రెయిన్‌లలో 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్‌ను పొందడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యాన్ని నిరూపించింది.
2030 నాటికి భారత్ నుంచి సంవత్సరానికి 2 బిలియన్ యూరోల ఎగుమతులను సాధించాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ ఎగుమతుల ప్రారంభం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది.
Tags : 1