Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
Breaking News
ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్ 21 రోజుల్లోనే..
Published on Sun, 06/21/2026 - 11:19
ప్రసవానంతరం చాలామంది మహిళలకు నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. చాలామందికి ఆ సమయంలో ఉన్నంత లావు తదనంతర కొనసాగుతుంది. పైగా బిడ్డకు పాలివ్వాల్సి ఉంటుంది కాబట్టి బరువు తగ్గడం అన్నది కష్టసాధ్యమైనదే. కానీ ఈ మామ్ 21 రోజుల పాటు జపనీస్ ఆహారపు అలవాట్లను పాటించి ఏకంగా 14 కిలోలు బరువు తగ్గింది. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
జపనీయులు ఆహార విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనాత్మకంగా తినడం, సమతుల్య పరిమాణంలో తీసుకోవడం, అతిగా తినకుండా ఆహారాన్ని ఆస్వాదించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ భారతీయ తల్లి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాన్సీ ఆ ఆహారపు అలవాట్లును ప్రయత్నించి చూసి సత్ఫలితాలను అందుకుంది. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది.
ఈ జపనీస్ ఆహారపు అలవాట్లు నిజంగానే మంచి మార్పు తీసుకువస్తాయా? లేదా? అనే కుతూహలంతో ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూసినట్లు తెలిపింది. ఆ నేపథ్యంలోనే 21 రోజుల పాటు జపనీసులు తినే ఆహారపద్ధతిని యథతథంగా పాటించినట్లు తెలిపింది. ఇందులో ఎలాంటి ఆహార మార్పులు, షార్ట్‌కట్‌లు ఉండవు. జపాన్ వాళ్లు సరిగ్గా ఎలా తింటారో అలానే తింటే చాలు అంటోంది.
ఆ ఐదు జపాన్ రూల్స్..
ముందుగా కళ్లతో తినండి..
భోజనం తినే ముందు అది చూడటానికి అందంగా ఉండాలని జపనీయులు నమ్ముతారు. చిన్న చిన్న భాగాలు, రకరకాల రంగులు..ఇలా ప్రతిదీ శ్రద్ధగా అమర్చి ఉండాలి అని ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వివరించారు. ఇది ఒక్కటే తినే వేగాన్ని తగ్గించి, అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతోందామె.
హరా హచి బు..
ఇది ఒక సాంప్రదాయ జపనీస్, కన్ఫ్యూషియన్-ప్రేరిత పద్ధతి. దీని అర్థం కడుపు 80% నిండే వరకు తినాలి. ఇది శ్రద్ధగా ఆహార పరిమాణాన్ని నియంత్రించడానికి ఒక సున్నితమైన విధానంగా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కడుపు నిండినట్లు గ్రహించడానికి సమయం ఇవ్వడం ద్వారా అతిగా తినడాన్ని నివారిస్తూ జీర్ణక్రియకు సహాయపడవచ్చు. ఇలా ప్రతి భోజనంలో దీనిని పాటిస్తూ.. ఏమీ కోల్పోతున్నాననే భావన కలగకుండా ఆహార పరిమాణాలు సహజంగానే తగ్గుతాయట.
ప్రతి భోజనంలో అన్నం.. కానీ చిన్న చిన్న భాగాలుగా!
తెల్ల అన్నమే చిన్న చిన్న భాగాలుగా తీసుకుంటానంటోంది. అయితే ప్రోటీన్ ఉండేలా..కూరగాయలు, మిసోసూప్‌తో కలిపి తింటానని మాన్సీ తెలిపారు. ఈ కలయిక రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందని ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిపారు.
భోజనానికి ముందు మిసో సూప్
మిసో సూప్‌లో పులియబెట్టిన పదార్థాలు ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది. మాన్సీ ప్రకారం, ఇది ఆమె దినచర్యలో ఒక భాగంగా మారిందని చెప్పుకొచ్చింది.
భోజనం మధ్యలో చిరుతిండ్లు..
మాన్సీ ప్రకారం, జపాన్‌లో భోజనాల మధ్య తినడం అనేది ఒక సాధారణ అలవాటు కాదు. దానికి బదులుగా, మధ్యలో ఏమీ తినకుండా రోజుకు మూడు పూటలా సరిగ్గా భోజనం చేయడంపై దృష్టి పెడతారు. ఇది జీర్ణవ్యవస్థకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తుందని, అలాగే ఆకలి సంకేతాల పట్ల శ్రద్ధ వహించడానికి సహాయపడుతుందని పేర్కొంది మాన్సీ.
ఇక్కడ ఈ తల్లి మాన్సీ వెయిట్‌లాస్ స్టోరీ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలంటే.. మన ప్లేట్‌లో ఉండే భోజనం ఎంత ముఖ్యమో అంతే విధంగా ఆలోచనాత్మకంగా తినడం, పరిమాణంపై శ్రద్ధ పెట్టడం అంతే ముఖ్యమని చెప్పకనే చెబుతోంది కదూ..!.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..)
Tags : 1