Breaking News

మస్క్‌ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!

Published on Wed, 06/17/2026 - 14:15

కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్‌ మస్క్‌కు మాత్రం ఈ సామెత సరిపోదేమో! ఎందుకంటే ఆయన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ స్టాక్‌మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్లకు అధిపతి) అవతరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు రాయిటర్స్, ఏపీ, బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం, ఇది ఆధునిక ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ క్రమంలో మస్క్‌ సంపద గురించి విస్తృత చర్చ సాగుతోంది.

జూన్ 12, 2026న నాస్‌డాక్‌లో "SPCX" టిక్కర్‌తో స్పేస్‌ఎక్స్‌ షేర్లు లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 డాలర్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నమోదైంది. లిస్టింగ్ అనంతరం స్పేస్‌ఎక్స్‌ మార్కెట్ విలువ తొలుత 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ట్రేడింగ్‌లో పెరుగుదలతో 2 ట్రిలియన్ డాలర్లను కూడా అధిగమించింది.

స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు ఉన్న భారీ వాటా, అలాగే టెస్లాలోని ఆయన పెట్టుబడులను కలిపి చూస్తే ఆయన నికర విలువ సుమారు 1.1 నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల మధ్యకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ సంపద ఎక్కువ భాగం కంపెనీ షేర్ల రూపంలో ఉండే "పేపర్ వెల్త్" మాత్రమే; అది నగదు రూపంలో అందుబాటులో ఉండదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కంపెనీల మార్కెట్ విలువలు మారితే ఈ సంపద కూడా మారే అవకాశం ఉంది.

శతాబ్దమైనా చాలదు!
ఒక ట్రిలియన్ డాలర్ల పరిమాణాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. గంటకు 10 లక్షల డాలర్లు అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.4 కోట్లు ఖర్చు పెడుతూ వచ్చినా 1 ట్రిలియన్ డాలర్లను పూర్తిగా ఖర్చు చేయడానికి శతాబ్దానికి పైగా సమయం పడుతుంది. అంతటి ఆర్థిక శక్తి ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ సొంతం.

దేశాల జీడీపీలను మించి..
మస్క్ సంపదను దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే దాని విస్తృతి మరింత స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని చాలా కొన్ని దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్లకు మించి ఉంటుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మస్క్ వ్యక్తిగత సంపద అధికంగా ఉంటుందన్న మాట.

అయితే ఈ అసాధారణ సంపదపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అసమానతలను పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మస్క్ అభిమానులు మాత్రం అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు, విద్యుత్ వాహనాల్లో ఆయన చూపిన దూరదృష్టే ఈ విజయానికి కారణమని పేర్కొంటున్నారు.

టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్ (గతంలో ట్విటర్‌), ఎక్స్‌ఏఐ వంటి సంస్థల ద్వారా ఆటోమొబైల్‌, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రభావం చూపుతున్న ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు.

Videos

Ambati: వీళ్ళందరూ హంతకులే..!

యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!

సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్

రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు

రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!

వనజ చితాభస్మంలో సర్జికల్ సీజర్.. నర్సులే డెలివరీ చేశారా?

గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్

అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?

Photos

+5

కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫ్యామిలీతో క్యూట్ (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)