Breaking News

ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..!

Published on Tue, 06/16/2026 - 13:52

ఇంతవరకు పలు డ్రైవర్‌లు తమ ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై నుంచి పుస్తకాలు, స్నాక్స్‌ వంటి ఏర్పాట్లతో ఫిదా చేశారు. కానీ ఈ డ్రైవర్‌ ఒక అడుగు ముందుకేసి ప్రయాణికులు నచ్చినట్లు జర్నీ చేసే అనుభవాన్ని అందించాడు. అది కూడా వాళ్లకు వాళ్లుగా ఎలాంటి రైడ్‌ చేయలనుకుంటున్నారో ఎంచుకునే మెనూతో ఇప్రెస్‌ చేయడం విశేషం. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది.

ఒక మహిళ సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ అదరి మనసులను తాకింది. ఆ పోస్ట్‌లో ఆ మహిళ తానొక అద్భుతమైన ప్రశాంతమైన రైడ్‌ చేశానంటూ ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు విదేశీ వ్యాపార పర్యటన అనంతరం తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినట్లు రాశారు. ఇంటికి వెళ్లేందుకు 45 నిమిషాల ఉబెర్ రైడ్ బుక్ చేసుకున్నారు. పైగా బాగా మూడు రోజులు పర్యటన కారణంగా బాగా అలిసిపోయి ఉండటంతో అస్సలు మాట్లాడే ఓపిక లేదని రాసుకొచ్చింది. 

ఆ డ్రైవర్‌ పేరు కబీర్‌ అని తన హెడ్‌రెస్ట్‌ వెనుకభాగంలో అంటించిన లామినేటెడ్‌ కార్డుని ఆమెకు అందించాడని చెప్పారు. దాన్ని ఆమె "రైడ్ మెనూ"గా వర్ణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తాము ఇష్టపడే సంభాషణను ఎంచుకునే వీలు కల్పించేలా రూపొందించాడు. ఆ కార్డులో నిశబ్దం కోసం "ది సైలెంట్ రైడ్",  తమ రోజు విశేషాలు పంచుకోవాలనుకునేవారికి "ది థెరపిస్ట్ రైడ్", నగరం గురించిన వాస్తవాలు, కథలు చెప్పే "ది టూరిస్ట్ రైడ్", ప్రయాణికులు కేవలం విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినగలిగే "ది రేడియో రైడ్" వంటి ఆప్షన్లు ఉన్నాయని చెప్పారామె. 

అయితే తాను సైలెంట్ రైడ్ ఎంపికను ఎంచుకుని, డ్రైవర్‌కు నిశ్శబ్దంగా ధన్యవాదాలు తెలిపానని చెప్పింది. వెంటనే కబీర్‌ తల ఊపి ఎయిర్‌ కండిషనింగ్‌ సర్దుబాటు చేసి, మొత్తం ప్రయాణాన్ని నిశబ్దంగా చేశాడు. ఆ అనుభవాన్ని తలుచుకుంటూనే అద్భుతంగా అనిపిస్తుందన్నారామె. ఈ ఏడాది తాను ఆస్వాదించిన ప్రశాంతబైన రైడ్‌ ఇదేనని చెప్పారామె. పైగా తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోగలిగానని పేర్కొందామె. ఆ తర్వాత తాను ఉదారంగా టిప్‌ ఇచ్చి, కబీర్‌ వ్యాపార ఆలోచనను ప్రశసించానని చెప్పారామె. 

అయితే డ్రైవర్‌ ఆ మెనూ ఏర్పాటు వెనుక ఉన్న  కారణాన్ని వివరిస్తూ..ఇది మెరుగైన టిప్స్‌ లేదా రేటింగ్‌లు సంపాదించడం కోసం ఈ కార్డుని తయారు చేయలేదని చెప్పడం విశేషం. తన కుమార్తె ప్రేరణతో ఈ కార్డుని రూపొందించినట్లు తెలిపాడు. ఆమె కూడి అలిసిపోయినప్పుడు..అపరిచితులతో మాములు సంభాషణ ఎంత విసుగ్గా, నీరసం తెప్పించినట్లు ఉంటుందో పంచుకుందని, దాన్ని ఆమె "మారథాన్ పరుగు"తో పోల్చిందని, చెప్పుకొచ్చాడు. 

ఆ నేపథ్యంలోనే ప్రయాణికులు విమర్శల భయం లేకుండా తమ ఇష్టపూర్వంగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా వ్యక్తపరిచే మెనూని రూపొందించానని తెలిపాడు. ఆ వివరణ తనను ఎంతగానో కదిలించిందని చెప్పుకొచ్చింది. ఆధునిక జీవతం ప్రజలను నిరంతరం ఎలా ఒ‍త్తిడికి గురిచేస్తోందో కదూ అనుకుంటూ..ఔను కొన్నిసార్లు ఒంటరిగా వదిలేయడంకు మించిన గొప​ దయ ఇంకొకటి లేదంటూ తన పోస్టుని ముగించారామె. ఈ పోస్ట్‌ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..ఇది మంచి ఆలోచన అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: థాయిలాండ్‌లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్‌ ..)
 

#

Tags : 1

Videos

గుడివాడకు నోటీస్ ఇచ్చిన హోం మంత్రి, సాయికృష్ణ కేసు మీద డీజీపీ, సీపీకి ఎందుకు ఇవ్వలేదు

సచిన్ దరిదాపుల్లోకి కూడా వైభవ్ రాలేడు ఎందుకంటే.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు

హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్

అనితను ఛీ కొడుతున్న టీడీపీ కీలక నేతలు?

సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.. అసలు ఏం చేశారు?

నా కొడుకు చనిపోయే ముందు చివరి మాటలు.. క్రాంతి కుమార్ తండ్రి షాకింగ్ కామెంట్స్

2026 ఎల్ నినో హెచ్చరిక..ఉన్న భయాలు - అసలు నిజాలు

CPM నేతల ముందు సాయి కృష్ణ మేనమామ భావోద్వేగం

GPS ట్రాకర్ పెట్టి, నా బిడ్డను నగ్నంగా గాయత్రి తల్లి చెప్పిన నిజాలు

కాలం మారుతోందా? నేరేడు చెట్టు చెబుతున్న నమ్మలేని నిజాలు

Photos

+5

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)