Breaking News

ప్రియాంకా చోప్రా తల్లి హెయిర్‌ టిప్స్‌..! ఇంట్లోనే హెయిర్‌ మాస్క్‌..

Published on Tue, 06/16/2026 - 11:54

ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు అఖౌరి చోప్రా గతంలో కాంతివంతమైన ముఖం కోసం సౌందర్య చిట్కాలను పంచుకోగా తాజాగా ఒత్తైన జుట్టు కోసం సింపుల్‌ హెయిర్‌ టిప్స్‌ షేర్‌ చేశారు. కురులు ఒత్తుగా దృఢంగా ఉండాలంటే సెలూన్‌లకు వెళ్లాల్సిన పనిలేదని, ఇంట్లోనే చేసే హెయిర్‌ మాస్క్‌ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని అంటోంది డాక్టర్‌ మధు అఖౌరి. 

చలన చిత్ర నిర్మాణ, కాస్మెటాలజిస్ట్‌, స్టూడియో ఈస్తటిక్‌ సహా వ్యవస్థాపకురాలు అయిన డాక్టర్‌ మధు 40 ఏళ్ల వృత్తి అనుభవంతో జుట్టు సంరక్షణకు సంబంధించిన చిట్కాలు, పద్దతులు గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అదికూడా ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే హెయిర్‌ మాస్క్‌ గురించి  వివరించారు. 

తన వారపు సంరక్షణ దినచర్యలో భాగంగా ఒక హెయిర్‌ మాస్క్‌ తయారీ విధానాన్ని పంచుకున్నారు. వంటగదిలో అందుబాటులో ఉండే ఈ మాస్క్‌ జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎలా ఉపకరిస్తుందో సవివరంగా వెల్లడించారామె. 

తయారీ విధానం..
అందుకోసం కొబ్బరి నూనె, మెంతులు, రోజ్‌మేరీ (నూనెలో ఒక రోజ్‌మేరీ రెమ్మ), కొంచెం ఉడికించిన బియ్యం నీరు (గంజి), చియా విత్తనాలు తీసుకుంటానని అన్నారు. ఇక్కడ నానబెట్టిన చియా విత్తనాల వల్ల ఆ మిశ్రమం జెల్లీలాంటి ఆకృతిని పొంది, జుట్టుకు సులభంగా రాసుకునేలా మారుతుందని ఆమె తెలిపారు. 

ఒక్కో పదార్థం ఒక చిన్న చెంచా చొప్పున తీసుకుని ఒక అద్భుతమైన మాస్క్‌ను తయారు చేస్తానని అన్నారామె. దీన్ని జుట్టుకు రాసుకుని గంటసేపు ఉంచి, ఆ తర్వాత కడిగేస్తానని అన్నారామె. ఇది తన జుట్టుని ఒత్తుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుందంటూ తన వీడియోని ముంగించారు 73 ఏళ్ల మధు అఖౌరి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మరి.

 

(చదవండి: '30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..)
 

Videos

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్

నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో

ఉద్యోగులకు కేంద్రం గిఫ్ట్.. క్షణాల్లో PF డబ్బులు విత్ డ్రా

వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు

రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్

అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నేరంలో CI, ACP, DGPకి కూడా భాగం ఉంది..

CIని సస్పెండ్ చేయడం కాదు.. ముందు నువ్వు రాజీనామా చెయ్

మనిషిని చంపే హక్కు నీకెవడిచ్చాడు? సాయి కృష్ణ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు..!

Photos

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)

+5

అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? తెలుగులో ఒకే సినిమా చేసింది(ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)