IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక
Breaking News
డిసెంబరులో...
Published on Tue, 06/16/2026 - 00:02
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీ ‘ఫౌజి’. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ సినిమా కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
కాగా ‘ఫౌజి’ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో దసరాకు రిలీజ్ కావడం లేదని తెలిసింది. డిసెంబరు మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో దేశభక్తి అంశాలు ఉండటంతో ఆగస్టు 15కి ‘ఫౌజి’ టీజర్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.
మరి.. ‘ఫౌజి’ డిసెంబరులోనే థియేటర్స్‌కు వస్తుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ‘కల్కి 2’ రిలీజ్ డేట్‌పై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
Tags : 1