Breaking News

థాయిలాండ్‌లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్‌ ..

Published on Mon, 06/15/2026 - 17:01

సోలోగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎ‍వ్వరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అలాంటిది ఒక పనిమనిసి దేవం కానీ దేశంలో సోలోగా పర్యటించింది, రికార్డు చేసి తన ట్రావెల్‌వ్లాగ్‌లో షేర్‌ చేసింది. అది నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టడమే కాదు..అక్కా మొట్టమొదటి వ్లాగ్‌ సూపర్‌ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆమె ఏ దేశం వెళ్లింది..అక్కడ ఎలా తనను తాను పరిచయం చేసుకుందంటే..

ఆ వీడియోలో ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అనీష్ భగత్ వద్ద పనిచేసే రేష్మా అతనితో కలిసి థాయ్‌లాండ్‌కు ప్రయాణించడం కనిపిస్తుంది. తన తొలి అనుభవాలను చిత్రీకరించి ట్రావెల్‌ వ్లాగ్‌లో షేర్‌ చేసిది. ఇదే తొలి ట్రావెల్‌ వ్లాగ్‌ వీడియో అని తెలిపింది. తాను ఒక పనిమనిషిగా మగతోడు లేకుండా భారతదేశం దాటి బయటకు రావడం ఇదే మొదటసారి అని వీడియోలో పేర్కొంది. 

తాను అనీష్‌ సోదరుడుతో కలిసి థాయ్‌లాండ్‌ చేరుకున్న తర్వాత ఒంటరిగా ఒకరోజంతా గడపమని చెప్పినట్లు తెలిపింది. అలాగే తన తొలి వాగ్‌లో, అనీష్ తనకు ఆసక్తి ఉన్న పనులు చేయమని అడిగాడని రేష్మా పంచుకుంది. అయితే తనకు దేనిపై ఆసక్తి ఉందో ఎప్పుడు ఆలోచించలేదు, పైగా అంత తీరిక కూడా దొరకలేదని చెప్పింది. 

అయితే తాను కేవలం పనమ్మాయినని, తనకు ఇక్కడ భాష రాదు, అలాగే చదవడం రాదని చెప్పింది. కానీ వంట చేయడం వచ్చు. అందుకే స్నేహితులను చేసుకునేందుకు బొబ్బట్లు చేసుకుని వెళ్లినట్లు తెలిపింది. 

అక్కడ ఎలా స్పెండ్‌ చేసిందంటే..
రేష్మా తనకు ఇష్టమైన చీర కట్టుకుని ఒంటరిగా థాయ్‌లాండ్‌ను అన్వేషించడానికి బయలుదేరడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశంలో కొత్త స్నేహితులను చేసుకోవడానికి ఆమె బొబ్బట్లతో నిండిన టిఫిన్ బాక్స్‌ను తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అందమైన ఆలయానికి చేరుకుని ఒక జర్మన్‌ వ్యక్తిని కలిసి బొబ్బట్లు ఇచ్చి స్నేహితుడిని చేసుకుంటుంది. 

ఆ తర్వాత రేష్మా ఒక 7-ఎలెవెన్‌ను సందర్శించింది, అక్కడ ఆమెకు పోపో అనే మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ పరిచయమైంది. ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఇద్దరూ వెళ్లే దారిలో కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం ఆస్వాదించారు. ఆ తదనంతరం ఆమె ఇలా పేర్కొంది. బాధ్యతల కారణంగా మన ఆడవాళ్ళం తరచుగా మన గురించి మనం ఎందుకు మరచిపోతామో నాకు తెలియదు.

సినిమాల్లో లాగా ఒక పుస్తకం చదువుతూ, ఒక గిన్నెడు మామిడి స్టిక్కీ రైస్ తింటూ ఆమె ఆ రోజును ముగించింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె తనలో తాను, “రేష్మా, నీ గురించి నాకు గర్వంగా ఉంది,” అని అనుకోవడం చూడొచ్చు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ, స్పందన రావడమే గాక, ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత హృద్యమైన ట్రావెల్ వ్లాగ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం.

 

(చదవండి: నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడితే..నేడు అందరూ మెచ్చే చెఫ్‌గా..!)

 

Videos

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

ఇసుక తుఫాన్ పట్టపగలే కమ్ముకున్న చీకట్లు ఎక్కడంటే

ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో

2026 నుంచి ప్రతి వాహనంలో ఇదే తప్పనిసరి!

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

Photos

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)

+5

‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

+5

సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)

+5

యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)

+5

ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)