Breaking News

ఆక్వా కలర్‌ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్‌..!

Published on Sun, 06/14/2026 - 11:48

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, నీతా అంబానీ కాలాతీమైన చేనేత వస్త్రాలతో సదా ఆకట్టుకుంటారు. మన భారతీయ వారసత్వాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని తన ఫ్యాషన్‌ శైలితో ప్రపంచానికి చాటుతుంటారు. ఈసారి అలానే అంతర్జాతీయ వైద్యుల సమావేశంలో అత్యద్భుతమైన బనారసి చీరలో మెరిశారామె.

విలాసవంతమైన కటన్ సిల్క్‌తో నేసిన ఈ చీరలో, టీల్-ఆక్వా రంగుల మనోహరమైన కలయిక నీతాకు రాజసమైన ఆకర్షణను అందించింది. ప్రకృతిని తలపించే బంగారు జరీ పూల  డిజైన్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బనారస్‌ నేతలో అత్యంత క్లిష్టమైన కడ్వానేత ఇది. ఈ చీరలో ప్రతి డిజైన్‌ను వస్త్రం ఉపరితలంపై ఎబ్రాయిడరీ చేయకుండా విడివిడిగా వస్త్రంలోనే నేస్తారు. దీని తయారీకి మూడు నెలలు పైనే పట్టిందట. ఈ చీరను మహమ్మద్ యాసిన్, ఇక్బాల్ అహ్మద్ రూపొందించారు. ఆ చీరల కళాకారులు దశాబ్దాల తరబడి నైపుణ్యం, ప్రతి దారంలో స్పష్టంగా కనిపిస్తుంది. 

చీరపై అడ్డంగా ఉన్న బంగారు జరీ పూల అల్లిక, మొఘల్ తోటల డిజైన్‌లో రూపొందించారు. ఒకరకంగా ఇది నాటి వైభవాన్ని కళముందు ప్రతిబింబించేలా చారిత్రక వైభవాన్ని జోడించారు. ఈ చీరకు సరిపోయే మెరిసే వజ్రాల చెవిపోగులు, గాజులు, ఉంగరాలు ఎంచుకున్నారామె. జుట్టు తాజా తెల్లని పువ్వులతో అలకరించి చక్కగా ముడిలా తీర్చిదిద్దారు. అలాగే నీతా తన రూపం హుందాగా కనిపించేలా లైట్‌ మేకప్‌ని ఎంచుకున్నారు. ఇక్కడ నీతా చీర చేనేత కళాకారుల అసామాన్య నైపుణ్యాన్ని చాటడమే కాకుండా సందర్భోచితంగా హుందాగా ఎలా దుస్తులు ధరించాలో చెబుతున్నట్లుగా ఉంది.

 

(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! చివరికి విజయ్‌ సైతం..జ)

 

Videos

IND A vs SL A: గ్రౌండ్‌లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక

నాలుగు కంపెనీలకు COS రద్దు.. ఎందుకంటే ?

మాకు CCTV ఫ్యూటేజ్ చూపించండి అంటే వాళ్ళు చెప్పిన సమాధానం..

చింతమనేనికి ఈడ్పుగంటి శ్రీనివాస్ మాస్ వార్నింగ్

AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!

YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు

22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి

చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్

కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కేపై దాడి

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

Photos

+5

మూడు ముళ్లకు 20 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ లయ

+5

తెలంగాణలో ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. (ఫోటోలు)

+5

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

సమంత 'బంగారం'.. పట్టుచీరలో రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)

+5

‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)

+5

'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)

+5

ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)