11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్
Breaking News
OG 2 Update: ‘ఓజీ’ మళ్లీ వస్తున్నాడు..ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు
Published on Fri, 06/12/2026 - 08:18
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి పార్ట్ 2 చేసే అవకాశం ఉందని ప్రమోషన్స్‌లోనే చెప్పాడు సుజీత్. ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ కల్యాణ్ కూడా వెల్లడించారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా పవన్ బిజీ కావడంతో ఓజీ 2 రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు పవన్. ‘ఓజీ 2’అప్‌డేట్ ఇచ్చాడు.
‘ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి’ అంటూ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో ఓజీ 2 కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ప్రస్తుతం సుజిత్.. నానితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ని కూడా ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓజీ2 ప్రాజెక్టును మొదలు పెట్టాలని సుజిత్ భావిస్తున్నాడట.
As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026
Tags : 1