Breaking News

దర్శక శిఖరానికి ప్రముఖుల నివాళి

Published on Thu, 06/11/2026 - 05:42

ప్రముఖ దర్శకుడు భారతీ రాజా బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. అవి వారి మాటల్లోనే...

భారతీరాజా గారి ప్రతిభ, ఆయన సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది నటీనటులను, దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసి, వారి ఎదుగుదలకు, సినీ పరిశ్రమ మనుగడకు కారణమైన మహోన్నత వ్యక్తి. ఆయన సృష్టించిన అద్భుత దృశ్యకావ్యాలను ఎప్పటికీ మరువలేం. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు చూడాలనుకున్నాను... కోలుకుంటారని భావించాను. ఆయన జీవించి ఉన్నప్పుడు చూడలేక పోవడం బా«ధగా మిగిలింది.         
–  రజనీకాంత్‌

భారతీయ సినిమా గొప్ప కథకుల్లో ఒకరైన భారతీరాజాగారిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన శాశ్వతంగా నిలిచిపోయే సినిమా కవిత్వంగా మార్చారు. భారతీరాజాగారి సినిమాలు తరాలుగా సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన దర్శకత్వంలోని ‘ఆరాధన’ చిత్రంలో పులిరాజు పాత్రలో నటించే అదృష్టం నాకు కలిగింది.     
– చిరంజీవి

భారతీరాజాగారి మరణం బాధగా ఉంది. ఆయనతో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో నా స్నేహం, ఆయన కళ ఎప్పటికీ జీవించే ఉంటాయి. – కమల్‌హాసన్‌

ప్రజలకు నాతో ఎలాంటి అనుబంధం ఉందో, భారతీరాజాగారితోనూ అలాంటి అనుబంధమే ఉంది. ఈ రెండూ వేర్వేరు కాదు. దేశాన్ని, దేశ ప్రజలను, కళాకారులను ప్రేమించడమే నా జన్మ హక్కు... అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు.         
– ఇళయరాజా

తన సహజమైన, రాజీపడని కథనంతో సినిమా రంగంలో విప్లవం సృష్టించిన నిజమైన మార్గదర్శకులు భారతీ రాజాగారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన వెండితెరపైకి తీసుకు వచ్చిన వాస్తవికత ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని ప్రత్యక్షంగా చూడటం, అలాగే వాటిని వేడుక గా జరుపుకోవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను.    
– రాజమౌళి

గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలు, టీనేజర్స్‌ మధ్య ఉండే ఆకర్షణలు... వంటి అంశాలను చూపించడంలో భారతీ రాజాగారి శైలి ప్రత్యేకమైనది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్‌ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్‌ టిక్‌ టిక్‌’ లాంటి థ్రిల్లర్స్‌తోనూ ప్రేక్షకులను మెప్పించారు. 
– పవన్‌ కల్యాణ్‌

భారతీ రాజాగారు తన దూరదృష్టి, అద్భుతమైన కథాంశాలు, భారతీయ సినిమాకు అందించిన విశేష సేవలతో ఎప్పటికీ నిలిచిపోయే ఒక నిజమైన లెజెండ్‌.      
– అల్లు అర్జున్‌ 

భారతదేశానికి అతి పెద్ద మహిళా సూపర్‌ స్టార్‌ శ్రీదేవిని అందించడమే కాకుండా, సత్యజిత్‌ రేగారి వాస్తవికతను, ముఖర్జీగారి పాత్రలను, చటర్జీగారి సందర్భోచిత హాస్య శైలిని అద్భుతంగా మిళితం చేశారు భారతీ రాజాగారు. అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని రకాల జానర్స్‌లో ఎంతో సహజత్వంతో కూడిన సినిమాలను రూపొందించిన నిజమైన అద్భుత దర్శకుడు ఆయన.             
– రామ్‌గోపాల్‌ వర్మ

తమిళ గ్రామాల్లోని ప్రేమను, జీవకళను మీలాగా మరెవ్వరూ తెరపై ఆవిష్కరించలేరు. నా సంగీతాన్ని దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామాలకు చేర్చినందుకు, అక్కడి ప్రజల జీవన గాథలను ప్రపంచానికి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. 
– ఏఆర్‌ రెహమాన్‌

నన్ను సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మా అమ్మ అయితే, మరొకరు నా గురువు భారతీ రాజాగారు. ఒక సంవత్సరం వ్యవధిలో ఈ ఇద్దర్నీ కోల్పోయాను. నా బాధను మాటల్లో వర్ణించలేను. నా హృదయం బాధతో భారంగా అనిపిస్తోంది. భారతీ రాజాగారి, మా అమ్మగారి జ్ఞాపకాలు, వారు నేర్పిన జీవితపాఠాలు నా జీవితాంతం నాతోనే ప్రయాణిస్తాయి.         
– రాధికా శరత్‌కుమార్‌

భారతీరాజాగారు చనిపోయారని తెలిసినా ఓ షూటింగ్‌లో ఉండటం వల్ల నేను, అలీగారు చెన్నైకి వెళ్లలేకపోయాం. నా తొలి చిత్రం ‘సీతాకోక చిలుక’లో నేను, అలీగారు కలిసి పని చేశాం. ఇన్నేళ్లకు భారతీరాజాగారు మనల్ని వదిలి వెళ్లే సమయంలో మేమిద్దరం కలిసి నటిస్తుండటం మాటల్లో చెప్పలేను. ఈ రోజు ముచ్చర్ల అరుణ అనే నేను నటిగా జనాలకు తెలుసు అంటే అందుకు కారణం భారతీ రాజాగారే.      
– అరుణ

ఈ రోజు నేను ఒక నటిగా ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం భారతీ రాజాగారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానుల హృదయాలపై ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు.   
    – రేవతి

నన్ను సినీ రంగానికి పరిచయం చేసిన భారతీ రాజాగారిని కోల్పోవడం ఎంతో ఆవేదనగా ఉంది.      
– సుకన్య

Videos

11 టీమ్ కెప్టెనే ఏపీకి దిక్కు లోకేష్ కు పేర్ని కిట్టు కౌంటర్ అదుర్స్

లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..

భారీగా పెరిగిన స్టాక్ జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు

వెన్నుపోటుకు రెండేళ్లు YSRCP నిరసన

అమెరికా సంబంధం అని పెళ్లి చేసుకుంటే?

నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు

రేయ్ జేసీ...? నువ్వు నన్ను ఆపగలనని అనుకుంటున్నావా..?!

ఆ రోజు సూర్యుడు మాయం, శతాబ్దంలోనే అతిపెద్ద వింత!

నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ

సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ

Photos

+5

చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్‌సీపీ సమర శంఖం (ఫొటోలు)

+5

కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)

+5

టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు...

+5

‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)

+5

ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘దీవానా’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)