Breaking News

కుమారుడి కోసం ఉద్యోగానికి రిజైన్‌..!కట్‌చేస్తే..

Published on Thu, 06/04/2026 - 17:11

గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్‌ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

అంకిత్‌ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్‌ని సోషల్‌ మీడియాలో ఎక్స్‌లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్‌ రాజీనామా లెటర్‌ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్‌గా రిజైన్‌ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్‌ని తిర్కస్కరించాడని చెప్పారు. 

అప్పుడు వెంటనే అంకిత్‌ పాండే డోంట్‌.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు.  ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్‌ బాక్స్‌తో ఆ అకౌంటెంట్‌ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్‌ పంచిపెట్టాడు. పైగా జాబ్‌లో మళ్లా జాయిన్‌ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్‌ అభ్యర్థించాడని అన్నారు. 

అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్‌ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్‌ పాండే పోస్ట్‌లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.

(చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!)

 

Videos

SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్

RCBలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!

జగనే మీ కన్నానయం.. నువ్వు రెండు సంవత్సరాలకే రాష్ట్రాన్ని నాశనం చేసావ్..

భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ.3,000లు ఢమాల్

సిగ్గుండాలి... చంద్రబాబు “విశాఖ బీచ్ షాక్స్” పై మహిళల ఫైర్

ఇది కాదు వేరే అకౌంట్ ఇస్తా దానికి రూ.25 లక్షలు సెండ్ చేసి... బయటపడ్డ షాకింగ్ నిజాలు

వైరల్ గా మరీనా కేశినేని నాని పోస్ట్, సొంత పార్టీ నేతలను కూడా వదలని కేశినేని చిన్ని

బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..

యుద్దానికి సిద్ధంగా ఉండు... మా దమ్మెంటో చూపిస్తాం

బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్

Photos

+5

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

+5

రామ్ చరణ్‌ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్‌ సందడి (ఫొటోలు)

+5

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు

+5

'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)

+5

పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)

+5

బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు