Breaking News

జాబ్ కోసం.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!

Published on Mon, 06/01/2026 - 18:00

గత కొన్నేళ్లుగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ, ఏఐ ప్రధానమని వినిపిస్తోంది. అయితే.. జాబ్ పోతే ఏముందిలే.. ఇంకో జాబ్ వచ్చేస్తుంది అనేవారికి.. అమెజాన్ మాజీ ఉద్యోగి కథ తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇటీవల ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదని ఆయన వెల్లడించడం.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో నెలకొన్న పోటీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

ప్రముఖ ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ఏడు సంవత్సరాల పాటు పనిచేశాడు. అయితే.. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ చేపట్టిన ఉద్యోగుల తొలగింపులలో భాగంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే.. ఆయనకు పెద్దగా సమస్య అనిపించలేదు. ఎందుకంటే ఆయన అనుభవం, నైపుణ్యాల కారణంగా అనేక ప్రముఖ సంస్థల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, అగోడా, ఉబెర్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

ఇంటర్వ్యూలలో తనకు కొంత నిరాశ ఎదురైంది. ఆ తరువాత కొంతకాలం ఉద్యోగ అన్వేషణ నుంచి విరామం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి అంతగా ప్రతికూలంగా కనిపించలేదు. కానీ.. కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించగా, పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నాడు.

2026 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. జాబ్ కోసం తన బయోడేటాను నాలుగు నుంచి ఐదు సార్లు అప్డేట్ చేసుకున్నాడు. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంకు అనుకూలంగా రెజ్యూమే రూపొందించి అప్లై చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ఎంత కఠినంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది.

ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు!

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఉద్యోగులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరికొందరు కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించడం, నియామక ప్రక్రియలను నిలిపివేయడం, ఉద్యోగాల కోసం పోటీ మరింత పెరగడం వంటి సమస్యలను ప్రస్తావించారు.

Videos

తెలంగాణకు భారీ వర్ష సూచన

మనిషివి చూస్తే.. ఒక పనికిమాలిన డిప్యూటీ స్పీకర్ పోస్ట్..

భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!

వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు

ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవాలా..!

తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు

ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ భీకర యుద్ధం..

బీజేపీకి అన్నామలై రాజీనామా..

కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా!

ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!?

Photos

+5

చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)

+5

'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)

+5

'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు)

+5

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు

+5

చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)

+5

అల్లు స్నేహా.. మే జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు)

+5

విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)