Breaking News

బ్రీజీ ఔట్‌ఫిట్‌... క్రేజీ స్టయిల్‌

Published on Sun, 05/31/2026 - 15:32

చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్‌ లూజ్‌గా ఉన్నాయని ఫీల్‌ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్‌ ట్రెండీ ఫ్యాషన్స్‌లో ఇప్పుడు ఓవర్‌సైజ్డ్, రిలాక్స్‌డ్‌ ఫిట్‌ కూడా ఒక హాట్‌ స్టయిల్‌గా మారిపోయింది. అందుకే, లూజ్‌గా, లైట్‌గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్‌ఫిట్స్‌ సమ్మర్‌లో కంఫర్ట్‌తో పాటు స్టయిల్‌ కూడా ఇస్తున్నాయి.

హీరో లినెన్‌ !
సమ్మర్‌ అనగానే గుర్తొచ్చేది లినెన్‌  బట్టలే. వీటిల్లో రిసార్ట్‌ కాలర్‌ అంటే ఓపెన్‌ కాలర్‌ షర్ట్స్‌ వేసుకుంటే పక్కా బీచ్‌ వైబ్‌ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్‌ ఫిట్టెడ్‌ టీషర్ట్‌ వేసి, పైన షర్ట్‌ బటన్స్‌ తీసేసి ఓపెన్‌గా వదిలేయండి. లేయర్డ్‌ లుక్‌ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. 

నిట్టెడ్‌ పోలోస్‌కి క్లాస్‌
రెగ్యులర్‌ కాలర్‌ టీషర్ట్స్‌ బోర్‌ కొడితే, ఈ నిట్టెడ్‌ అంటే అల్లిక డిజైన్‌  పోలోస్‌ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్‌ కూడా ఇస్తాయి.

వైడ్‌ లెగ్‌ ప్లీటెడ్‌ ట్రౌజర్స్‌ కింద లూజ్‌గా ఉంటూ, పైన ప్లీట్స్‌ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్‌ లుక్‌ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్‌ మీటింగ్స్‌ లేదా స్మార్ట్‌ క్యాజువల్‌ ఈవెంట్స్‌కి కూడా పర్ఫెక్ట్‌గా సెట్‌ అవుతాయి. లైట్‌ కలర్స్‌లో ప్లీటెడ్‌ ట్రౌజర్స్‌ వేసుకుని, లోఫర్స్‌ జోడిస్తే సమ్మర్‌ ఫ్యాషన్‌లో మీరే టాపర్‌!

డ్రాస్ట్రింగ్‌ లినెన్‌ ప్యాంట్స్‌
బెల్ట్‌ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్‌  ప్యాంట్లు బెస్ట్‌ చాయిస్‌. క్యాజువల్‌ అవుటింగ్స్, ఈవినింగ్‌ వాక్స్, ట్రావెల్స్‌ ఏదైనా సరే ఈజీగా సెట్‌ అయిపోతాయి.

జాగ్రత్తలు!

లూజ్‌ ఫిట్‌ అంటే చాలా పెద్ద సైజ్‌ కాదు. లేదంటే బెడ్‌షీట్‌లా కనిపించే చాన్స్‌ ఉంది.

లైట్‌ వెయిట్‌ ఫ్యాబ్రిక్స్‌ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్‌ అయితే సమ్మర్‌లో భరించలేరు.

ఒక ఔట్‌ఫిట్‌లో చాలా ప్రింట్స్‌ వద్దు. రిలాక్స్‌డ్‌ ఫిట్‌ అంటే క్లీన్, సింపుల్‌ లుక్‌ బెటర్‌.

లైట్‌ కలర్స్‌ వేసుకుంటే సమ్మర్‌లో కూల్‌గా కనిపిస్తారు. బ్లాక్‌తో పూర్తి ఔట్‌ఫిట్‌ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్‌గా కనెక్ట్‌ అయిపోతాడు! 
కొండి దీపిక

(చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..)

#

Tags : 1

Videos

తెలంగాణకు భారీ వర్ష సూచన

మనిషివి చూస్తే.. ఒక పనికిమాలిన డిప్యూటీ స్పీకర్ పోస్ట్..

భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!

వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు

ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవాలా..!

తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ ధరల పెంపు

ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ భీకర యుద్ధం..

బీజేపీకి అన్నామలై రాజీనామా..

కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా!

ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!?

Photos

+5

చిరంజీవితో 16 సినిమాలు.. ఈమెతో పాటు కూతుళ్లు కూడా హీరోయిన్లే (ఫొటోలు)

+5

'పెద్ది' భామ.. చీరలో నిండుగా అందంగా (ఫొటోలు)

+5

'కాక్‌టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్‌...రష్మిక సందడి (ఫొటోలు)

+5

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్షమాభిక్షపై 91 మంది విడుదల (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో హీరో విష్ణు విశాల్ ఫారిన్ ట్రిప్.. ఫోటోలు

+5

చీరలో ధగధగా మెరిసిపోతున్న దివ్యభారతి (ఫొటోలు)

+5

అల్లు స్నేహా.. మే జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’ (ఫొటోలు)

+5

విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)