Breaking News

ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు

Published on Sun, 05/31/2026 - 06:10

‘‘సినిమా మేకింగ్‌లో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషుల భావోద్వేగాలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రత్యామ్నాయం కాదు... కాలేదు’’ అని హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఇటీవల స్పీల్‌బర్గ్‌ సినిమా మేకింగ్‌లో కృత్రిమ మేధ వినియోగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏం మాట్లాడారంటే... ‘‘కళలో మానవీయ కోణం అన్నది ఎంతో ముఖ్యం. రచయితల టేబుల్‌ వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉండి ఆ స్థానాన్ని ఏఐ భర్తీ చేయడాన్ని నేను ఇష్టపడను. సొంతంగా ఆలోచించే లేదా అనుభవించే స్పృహ కంప్యూటర్లకు ఉంటుందని నేను నమ్మను. 

మానవ ఆత్మకు, వారి అంతర్గత సృజనాత్మకతకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. సినిమా అనేది కొన్ని కమాండ్స్‌ సమాహారం కాదు. అది మానవ మేధస్సు, హృదయం నుండి వచ్చే అద్భుత సృష్టి. ఏఐని ఒక టూల్‌గా ఉపయోగించుకోవడానికి అభ్యంతరం లేదు. సినిమా షూటింగ్‌ కోసం అనువైన లొకేషన్లను వెతకడంలో ఏఐ సహాయం తీసుకుంటే ఓకే.

 అయితే సినిమా రంగంలో సృజనాత్మక ప్రక్రియకు సంబంధించిన ఏ విషయానికైనా ఏఐని తుది నిర్ణయంగా తీసుకోకూడదని హాలీవుడ్‌ని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను చేసే సినిమాలకు ఏఐ అనేది విరుద్ధం. నటీనటుల ఎంపిక, కెమెరాను ఏ కోణంలో పెట్టాలి? డైలాగులు ఎలా రాయాలి? వంటి సృజనాత్మక విషయాలను ఏఐ టూల్‌ నాకు సూచించడానికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని స్పీల్‌బర్గ్‌ పేర్కొన్నారు.  – స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)