Breaking News

రణ్‌వీర్‌ సింగ్‌ని కాదు... ఎఫ్‌డబ్య్లూఐసీఈని బ్యాన్‌ చేయండి

Published on Sun, 05/31/2026 - 06:05

‘‘డాన్‌ 3’ సినిమా వివాదంలో రణ్‌వీర్‌ సింగ్‌కు మద్దతుగా నిలిచారు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌ 3’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికి మూడు వారాల ముందు ఈ ప్రాజెక్ట్‌ నుంచి రణ్‌వీర్‌ తప్పుకోవడంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్‌ ఆరోపించారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎం΄్లాయీస్‌’ (ఎఫ్‌డబ్య్లూఐసీఈ) యూనియన్‌కు రణ్‌వీర్‌పై ఫర్హాన్‌ ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై చర్చించేందుకు ‘ఎఫ్‌డబ్లూఐసీఈ’ ప్రతినిధులు రణ్‌వీర్‌ సింగ్‌కు మూడుసార్లు నోటీసులు పంపారు. అయితే సరైన స్పందన లేక΄ోవడంతో దాదాపు మూడేళ్ల పాటు రణ్‌వీర్‌æసినిమాల చిత్రీకరణలో పాల్గొనకూడదని, ఎఫ్‌డబ్య్లూఐసీఈ తీర్మానించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రామ్‌గోపాల్‌ వర్మ ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేసిన సుధీర్ఘ పోస్ట్‌ సారాంశం ఇలా...  ‘‘రణ్‌వీర్‌ సింగ్‌ని కాదు ఎఫ్‌డబ్ల్యూఐసీఈని నిషేధించండి. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థ కాదు.

 చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి కొందరు వ్యక్తులు ప్రైవేటుగా సమావేశమై, ఒక ఎజెండాతో ఈ తీర్పును ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారు. ‘ధురంధర్‌’ సినిమాతో రణ్‌వీర్‌ సింగ్‌ సాధించిన భారీ క్రేజ్‌ చూసి భయపడుతున్న కొందరు నటులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నట్లున్నారు. నిర్మాత ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌లో నష్టం జరిగిందని చెబుతున్నారు. భారతదేశంలో చాలా వ్యాపారాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇలాంటి సివిల్‌ వివాదాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ వారిలో ఒకరు లేదా ఇద్దరూ కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు న్యాయమూర్తి ఆ విషయాన్ని తేలుస్తారు. నేను ఫైనల్‌గా చెప్పేది ఒకటే... ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్‌ వివాదంలోకి అనవసరంగా తలదూర్చవద్దు’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రామ్‌గోపాల్‌ వర్మ.

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)