Breaking News

9 రోజుల్లో రూ. 40 కోట్ల కలెక్షన్స్‌.. మరాఠీ సినిమా ఊచకోత!

Published on Sat, 05/30/2026 - 18:37

ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్‌ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. కంటెంట్‌ సంగతి ఎలా ఉన్న సరే.. రిలీజ్‌ ముందు వరకు‘ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అంటూ ప్రచారం చేసి మరీ ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూళ్లు సాధించి,  సరికొత్త రికార్డును సృష్టించింది. అదే మరాఠి చిత్రం ‘దేవూల్‌ బంద్‌ 2’.

స్నేహల్‌ తార్డే, మోహన్‌ జోషిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ తార్డే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ భారీగా పెరిగాయి. మౌత్‌ టాక్‌తోనే మొదటి వీకెండ్‌లో రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్‌ అయిన  9 రోజుల్లోనే రూ. 40.80 కోట్లు(గ్రాస్‌) వసూలు చేసి, అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌ 10 మరాఠి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.

దేవూల్‌ బంద్‌ 2 కథేంటంటే.. 
మహిళ రైతు సంగీత పేగుడే(స్నేహల్‌)కు వరుస కష్టాలు వస్తుంటాయి. తన బాధలను తీర్చమని నిత్యం దేవుడిని వేడుకుంటుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై పక్కనే ఉన్న పుట్టపై రాయి విసిరేస్తుంది. వెంటనే అందులో నుంచి శ్రీస్వామి సమర్థ్‌ దర్శనమిస్తాడు. ఆమెతో కలిసి గ్రామానికి కూడా వెళ్తాడు. దేవుడు రాకతో సంగీత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)