Breaking News

చాలామందితో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్‌నర్స్‌కు ముందే తెలుసు: నటి షాకింగ్ కామెంట్స్

Published on Sat, 05/30/2026 - 15:49

ప్రముఖ నటి షహానా గోస్వామి తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రం ఆమె గుర్తు పట్టేస్తారు. హిందీలో పలు సూపర్ హిట్‌ చిత్రాల్లో కనిపించింది. 2008లో 'రాక్ ఆన్!' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత  'ఫిరాక్', 'మిడ్‌నైట్స్ చిల్డ్రన్', 'డెస్పాచ్' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె చివరిసారి 'సంతోష్' అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీని  2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా  ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యుకు హాజరైన 40 ఏళ్ల ముద్దుగుమ్మ రిలేషన్, ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను రిలేషన్‌షిప్‌లో ఎల్లప్పుడు  ఓపెన్‌గానే ఉన్నానని  షహానా వెల్లడించారు. తాను ఇతరులతో కూడా శారీరకంగా సన్నిహితంగా ఉంటాననే విషయం.. తనతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తులకు పూర్తిగా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సంబంధాలను కొనసాగించే విధానంలో పారదర్శకత చాలా ముఖ్యమని.. అందుకే నా రిలేషన్స్‌లో ఎలాంటి రహస్యాలు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు.

ప్రస్తుతం తనకు భాగస్వామి ఎవరు లేరని కూడా గోస్వామి వెల్లడించారు. తన జీవితంలోని సంబంధాలు సాంప్రదాయమనే ముద్ర కాకుండా.. ప్రేమ, స్నేహం మీద నిర్మించబడ్డాయని తెలిపారు. తన రిలేషన్స్‌ సంప్రదాయాలను అనుసరించకపోయినా.. అవి సాధారణమైనవి కావని అన్నారు.

ప్రేమ అనేది నిర్బంధంగా ఉండకూడదనేది తన నమ్మకమని గోస్వామి అన్నారు.  తాను భావోద్వేగ స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తానని తెలిపారు. సంబంధాలు అనేవి కట్టుబాట్లలోకి బలవంతంగా నెట్టబడకుండా సహజంగా అభివృద్ధి చెందాలని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ప్రేమ స్వేచ్ఛగా ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తానని వెల్లడించారు. ఈ ఆలోచన తాను ఎంచుకునే సంబంధాలను.. అలాగే కాలక్రమేణా అవి అభివృద్ధి చెందే విధానాన్ని కూడా ప్రభావితం చేసిందని షహానా అభిప్రాయం వ్యక్తం చేశారు.

మిలింద్ సోమన్‌తో డేటింగ్..బ్రేకప్

గతంలో మిలింద్ సోమన్‌తో రిలేషన్‌, విడిపోవడంపై కూడా షహానా గోస్వామి స్పందించారు. మోడల్ మిలింద్ సోమన్‌తో తన సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు అతన్ని సినిమాల్లో చూసి ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. చివరికి ఆన్‌లైన్‌లో అతని కాంటాక్ట్ వివరాలను కనుగొన్నానని వెల్లడించింది. కాగా.. వీరిద్దరు డేటింగ్ ప్రారంభించడానికి ముందు, దాదాపు ఆరు సంవత్సరాల పాటు టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని తెలిసింది. అయితే మిలింద్, షహానాల రిలేషన్‌కు 2013లో ఎండ్‌ కార్డ్ పడింది.

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)