9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
సెలబ్రిటీలను అన్‌ఫాలో చేసిన కరణ్.. కారణమేంటో తెలుసా?
Published on Sat, 05/30/2026 - 11:51
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేసిన ఓ అనూహ్యమైన పని ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షారూఖ్ ఖాన్, ఆలియా భట్, కరీనా కపూర్, అనన్య పాండే.. ఇలా పలువురు తారలను అన్‌ఫాలో అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
టైం వేస్ట్
దీనిపై కరణ్ జోహార్ స్పందిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఈ కారణంగా నా విలువైన సమయం వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకే అన్‌ఫాలో అయ్యాను. ఇది జాతీయస్థాయి వార్త కాదు, కేవలం డిజిటల్ డీటాక్స్ మాత్రమే.. మీ వ్యూస్, క్లిక్స్ కోసం మరేదైనా విషయాన్ని చూసుకోండి అని పేర్కొన్నారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.75 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండగా ఆయన మాత్రం 49 మందినే ఫాలో అవుతున్నారు.
చదవండి: జూన్‌లో రిలీజయ్యే సినిమాల జాబితా
Tags : 1