Breaking News

వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..

Published on Tue, 05/26/2026 - 15:25

ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్న జంటలు కోకొల్లలు. తీవ్రంగా పరిగణించాల్సిన సమస్యలేవి లేకపోయినా..విడాకులు కోరుతుండటం బాధకరం. ఇక్కడ ఈ కేసులో కూడా అలాంటి వింతే చోటు చేసుకుంది. కేవలం భార్యకు వంట రాదని విడాకులు ఇవ్వమంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు భర్త. అతడికి ధర్మాసనం దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి చివాట్లు పెట్టింది. 

అసలేం జరిగిందంటే..ఈ జంటలకు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వివాదాలు మొదలయ్యాయి. అదే సంవత్సంరలో అతడు "మానసిక క్రూరత్వం" అనే కారణంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు వంట చేయడం రాదని, ఆమె మొరటుగా, మాట వినకుండా ఉంటుందని, ఇంటి పనులను సరిగ్గా చేయలేదని, దీనివల్ల తనకు మానసిక ఒత్తిడి కలిగిందని ఆరోపణలు చేశాడు. 

పైగా వైవాహిక చట్టం ప్రకారం ఈ చర్యలు క్రూరత్వం కిందకు వస్తాయని కూడా అతను వాదించాడు.అయితే భార్య ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. వాస్తవానికి, పాత్రలు కడగడం, శుభ్రం చేయడం, వంట చేయడం వంటి అన్ని ఇంటి పనులను తనతోనే చేయించారని, మిగిలిపోయిన ఆహారాన్ని కూడా తినమని బలవంతం చేశారని ఆమె పేర్కొంది.

ధర్మాసనం ఏం చెప్పిందంటే..
జస్టిస్ భారతి డాంగ్రే మరియు జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాహం అనేది సమానుల భాగస్వామ్యం, అంతేగాని సేవా ఒప్పందం కాదు. భార్యను పనిమనిషిగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. వంట చేయడం లేదా శుభ్రపరచడం వంటి పనులు చేయడంలో విఫలమైనంత మాత్రాన అది మానసిక క్రూరత్వంగా పరగణించలేమని పేర్కొంది. 

వివాహం జరిగిన తొలినాళ్లలో జరిగిన అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసుకునే ధోరణిలో చూడాలి తప్ప క్రూరత్వ ఆరోపణల కిందకు రాదంటూ మండిపడింది. పైగా ఫ్యామిలీ కోర్టు 2010లో భార్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతుల కోసం ఇచ్చిన ప్రకటన ఆధారంగా స్వతంత్రంగా సంపాదించుకోగలదని నిర్థారించి, ఆమెకు భరణం నిరాకరిస్తూ.. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సవాలు చేస్తూ భార్య ముంబై హైకోర్టుని ఆశ్రియంచింది. ఆ నేపథ్యంలోనే ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు తీర్పుని కొట్టివేస్తూ..చిన్న తరహా కార్యకలాపాలను ఆదాయానికి రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. 

అలాగే విడాకుల కేసులలో చట్టపరంగా మానసిక క్రూరత్వం అంటే ఏమిటో కూడా ధర్మాసనం వివరించింది. క్రూరత్వంలో అవమానం, భావోద్వేగ బాధ కలిగించే లేదా వివాహాన్ని కొనసాగించడం అసాధ్యం చేసే తీవ్రమైన ప్రవర్తన ఉండాలని పేర్కొంటూ విడాకులను రద్దు చేసింది. అలాగే భర్తను నెలకు రూ. 20,000 చెల్లించాలని అదేశించింది. 

(చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ)
 

 

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)