హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను
Breaking News
నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!
Published on Tue, 05/26/2026 - 09:52
జీవితం చాలా పరీక్షలు పెడుతుంది. ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటుంది. నిరాశతో నిండిపోయి ఉంటాం. అయినాసరే లేచి నిలబడి.. ఓటమికి తలవంచక పోరాడితే..ఎవరో ఒకరి రూపంలో సాయం అందుతుంది అనేందుకు ఈ ఘటన ఉదాహరణ.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వన్-డే స్పోర్ట్స్ ఈవెంట్ అయిన ఐరన్‌మ్యాన్ ఎండ్యూరెన్స్ పోటీకి సన్నద్ధమువుతున్నాడు మాజీ నావికా ఇంజనీర్ విన్సెంజో గరోఫాలో. ఆ నేపథ్యంలోనే సైకిల్ రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా అతడి కృత్రిమ కాలు బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోతుంది. అతడు వెంటనే సైకిల్‌పై నుంచి దిగి బ్యాలెన్స్ చేసుకుని సైకిల్ ఒక పక్క వద్ద పెడుతుండగా..ఇంతలో ఒక వ్యక్తి పరుగుపరుగున వచ్చి అతడి కృత్రిమ కాలుని ఇవ్వడమే గాక అతడి సైకిల్ని ఒక పక్కకు పెట్టి అతడి కాలుకి ఆ కృత్రికాలుని అమర్చడంలో సాయం అందించాడు.
ఆ అపరిచిత వ్యక్తి దయకు విన్సెంజో గరోఫాలో కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పరిగెత్తుకుంటూ వచ్చి తక్షణమే సాయం చేసిన ఆ పెద్దమనిషికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చశాడు. చివరగా విన్సెంజో గరోఫాలో జీవితం నా పట్ల చాలా కఠినంగా ఉంది. తనను లెక్కలేనన్ని సార్లు కిందపడేలా చేసింది.
కానీ అది నన్ను ఆపలేకపోయింది. ఈ ప్రపంచాన్ని భిన్నంగా చూడటం నేర్పించింది. చిన్న చిన్న విషయాలను, ప్రయత్నాలను ఎవరు చూడని అదృశ్య పోరాటాలను అభినందించడం నేర్పింది అని భావోద్వేగంగా చెప్పాడు. అయితే ఏం జరిగినా ఎప్పటికీ గివ్‌అప్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానన అన్నాడు.
(చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?)
Tags : 1