Breaking News

ప్రెగ్నెన్సీలో హారర్‌ సీన్‌ చూసి భయపడ్డా.. అబార్షన్‌ అయింది: ఉదయభాను

Published on Sun, 05/24/2026 - 13:54

ఉదయభాను..ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్‌ యాంకర్‌. ఆమె ఎనర్జీ, స్టైల్‌, మాటతీరుతో టెలివిజన్‌ రంగంలో ప్రత్యేకమైన ట్రెండ్‌ చేసిన యాంకర్‌ ఆమె. డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా ఢింభకా, ఢీ లాంటి షోల విజయంలో ఉదయభాను కీలక పాత్ర పోషించింది. అయితే పెళ్లి తర్వాత ఆమె ఎక్కువ షోలు చేయలేకపోయింది. ఇక పిల్లలు(ట్విన్స్‌) పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు పూర్తిగా బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. చాలాకాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వస్తోంది. ఒకవైపు సినిమాలతో పాటు కొన్ని ఈవెంట్స్‌కి హోస్ట్‌గాను చేస్తోంది. అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం పిల్లలు, కుటుంబమే అంటోంది ఉదయ భాను. పిల్లలే తన ప్రపంచం అని.. వాళ్ల కోసం ఏదైనా వదులుసుకుంటానని చెబుతోంది. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో పడిన బాధల గురించి, అంతకు ముందు జరిగిన అబార్షన్‌ గురించి చెబుతు ఎమోషనల్‌ అయింది.

విమానం ఎక్కేముందు తెలిసింది
పెళ్లి తర్వాత కూడా నేను వరుస ఈవెంట్స్‌తో బిజీ అయిపోయాను. ఓ సారి ఈవెంట్‌ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అంతా రెడీ చేసుకొని వెళ్లే ముందు డౌట్‌ వచ్చి చెక్‌ చేసుకుంటే నేను గర్భం దాల్చిన విషయం తెలిసింది.వెంటనే వైధ్యులను సంప్రదించా. ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చా లేదా? అని అడిగా. ఏం పర్లేదు.. వెళ్లమని డాక్టర్లు చెప్పారు. అక్కడకు వెళ్లిన తర్వాత వరుస ఈవెంట్స్‌ చేశాను. చాలా అలసిపోయా. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లా.అక్కడ చెక్‌ చేసి బేబీ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు.

ఫ్లోర్‌ మొత్తం రక్తమే.. 
నాకు హారర్‌ సినిమాలంటే చాలా భయం. అస్సలు చూడలేను. భయపడే సీన్స్‌ వస్తే కళ్లు, చెవులు మొత్తం మూసుకుంటా. ఓ రోజు అమెరికాలోనే కజిన్స్‌, ఫ్రెండ్స్‌ హారర్‌ సినిమా చూస్తున్నారు. అప్పుడు నేను కూడా ఇంట్లోనే ఉన్నా. కానీ సినిమా మాత్రం చూడనని చెప్పేశా. అనుకోకుండా ఆ సినిమాలో ఓ సీన్‌ చూశా. చాలా భయపడిపోయా. నా బాడీతో ఏదో తేడా వచ్చిందనే విషయం అర్థమవుతుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం.డాక్టర్లు ఏదేదో చెక్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటేది చెప్పట్లేదు. నాకు పెద్ద ఎత్తున రక్తస్త్రావం జరుగుతోంది. ఫ్లోర్‌ మొత్తం బ్లడ్‌తో నిండిపోయింది. కాసేపటి తర్వాత మిస్‌ క్యారీ(అబార్షన్‌) అయిందని చెప్పారు.

ఏడాది పాటు డిప్రెషన్‌.. 
నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెంట్‌ విషయం తెలియగానే చాలా ఆనంద పడ్డాను. కానీ  అనుకోకుండా మిస్‌ క్యారీ కావడంతో చాలా బాధపడ్డా. ఏడాది పాటు డిప్రెషన్‌లోకి వెళ్లా. కానీ ఆ భగవంతుడు నాకు సహాయం చేశాడు. ఏడాది తర్వాత మళ్లీ గర్భవతిని అయ్యాను. టెస్ట్‌ చేస్తే కలవలు అని తెలిసింది. మా ఆనందం డబుల్‌ అయింది. వెంటనే ఈవెంట్స్‌ అన్ని క్యాన్సిల్‌ చేసుకున్నా. నేను చేస్తున్న షో కూడా రద్దు చేసుకున్నా. దాదాపు మూడేళ్ల పాటు నేను దేని గురించి ఆలోచించలేదు. ట్రావెల్‌ చేయడం వల్లే అబార్షన్‌ అయిందనే అనుమానంతో ఎక్కడకు వెళ్లలేదు. 

ప్రెగ్నెంట్‌ సమయంలో 100 కిలోల బరువు పెరిగాను. పొట్టలో ఇద్దరు 3 కిలోల చొప్పున ఉండడంతో బెడ్‌ మీద నుంచి దిగలేకపోయా. ఒక పక్క నుంచి మరో పక్కకు తిరగానికే దాదాపు 15 నిమిషాల సమయం పట్టేది. డెలివరీ కాస్త ముందుగానే చేసుకోమని వైద్యులు చెప్పారు. కానీ ఎంత బాధనైన భరిస్తా.. సరైన సమయానికే సర్జరీ చేయమని చెప్పా. పిల్లలు పుట్టాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు వాళ్లే నా ప్రపంచం’ అని ఉదయభాను చెప్పుకొచ్చింది. 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : అందమా.. అందుమా.. (ఫొటోలు)

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)